జయబచ్చన్ తోపాటు సల్మాన్ ను ఇరికించిన కస్తూరీ

0

బాలీవుడ్ డ్రగ్స్ దందాపై నిన్న నటుడు ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలపై ఈరోజు రాజ్యసభలో జయా బచ్చన్ కౌంటర్ ఇచ్చారు. కొందరు తప్పు చేస్తే అందరు బాలీవుడ్ వాళ్లను అనడం అధికార బీజేపీ ఎంపీ… స్వయంగా నటుడైన రవికిషన్ కు తగదని జయా బచ్చన్ హితవు పలికారు.తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నావ్ అని సూటిగా ప్రశ్నించారు.

తాజాగా జయబచ్చన్ వ్యాఖ్యలపై ప్రముఖ తమిళనటి కస్తూరీ శంకర్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే కోలీవుడ్ లో ముక్కుసూటిగా మాట్లాడే పేరున్న కస్తూరి కోలీవుడ్ నెపోటిజం మూవీ మాఫియా వంటి వాటిపై స్పందించింది.

బాలీవుడ్ ఇండస్ట్రీనే మొత్తం ఇండియన్ మూవీ ఇండస్ట్రీగా ప్రొజెక్ట్ చేయడంపై కస్తూరీ ఫైర్ అయ్యింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. జయబచ్చన్ గారు.. కేవలం బాలీవుడ్ మాత్రమే భారత సినీ పరిశ్రమ కాదని.. బాలీవుడ్ డ్రగ్స్ మాఫియా లింక్ మొత్తం సినిమా పరిశ్రమకు ఆపాదించకండి అని కస్తూరి హితవు పలికారు. డ్రగ్స్ తీసుకునే వారు లూజర్స్ కాదని.. జెలసీతో తీసుకుంటున్నారని అన్నారు. వారంతా ఏదో సాధించిన వారేనని అన్నారు.

నిజాయితీగా మాట్లాడాల్సి వస్తే.. సుశాంత్ సింగ్ మరణంపై మాట్లాడేవారే శిక్షకు అర్హులు అని కస్తూరీ అన్నారు. బాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకొని.. తాగి జింకలు వేటాడుతూ.. జనాలపై కార్లను ఎక్కించే వారు కూడా ఉన్నారంటూ ‘సల్మాన్ ఖాన్’ గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసి దుమారం రేపింది కస్తూరి..