ప్రణీతకు లక్కీ ఛాన్స్

0

తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ప్రణీతకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. పవన్.. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా కూడా ఈమెకు మాత్రం టాలీవుడ్ లో లక్ కలిసి రాలేదు. తెలుగులో ఆఫర్లు దక్కించుకోలేక పోయిన ప్రణీతకు ఇతర భాషల్లో ఆఫర్లు వస్తున్నాయి. ఈ సమయంలోనే ఈమెకు టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించింది. కాని గత రెండేళ్లుగా ఈమెకు ఛాన్స్ దక్కడం లేదు. ఈమెకు ఎట్టకేలకు టాలీవుడ్ లో ఆఫర్ దక్కించుకుంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈమెకు రవితేజ సరసన నటించే అవకాశం దక్కింది.

రవితేజ.. రమేష్ వర్మల కాంబోలో రాబోతున్న సినిమాలో ప్రణీత ఒక హీరోయిన్గా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ సినిమా కోసం మరో హీరోయిన్ ను కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందబోతున్న ఈ సినిమాలో రవితేజ అభిమానులు కోరుకున్నట్లుగా కనిపించబోతున్నాడు అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం దర్శకుడు రమేష్ వర్మ అన్ని ఏర్పాట్లు చేశాడు. ప్రస్తుతం సినిమా కోసం నటీ నటుల ఎంపిక జరుగుతోంది. ప్రణీతకు ఈ సినిమా ఆఫర్ రావడంతో ఆమె చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆఫర్ తో మళ్లీ టాలీవుడ్ లో ఆమె బిజీ అయ్యేనా చూడాలి.