ఈ సమయంలో వారికి మద్దతు ఇవ్వడం మన బాధ్యత : మహేష్

0

నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా సినీ ప్రముఖులు పలువురు తమ చిన్నతనంను మరియు తమకు విద్య నేర్పిన వారిని గుర్తు చేసుకున్నారు. సమాజంలో గురువుల ప్రాముఖ్యతను గురించి చాలా మంది షేర్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ విషయమై ట్వీట్ చేశాడు. నేర్చకోవడానికి ఎలాంటి బౌండరీలు లేవు. విద్యార్థులను ఎవరైతే ప్రతిభావంతులుగా మార్చుతున్నారో విద్యార్థుల జీవితాలను మంచి మార్గంలో నడుపుతున్న టీచర్లకు ఈ విపత్కర పరిస్థితుల్లో మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మనకు ఆదర్శంగా నిలిచే గురువులను మనకు సాయంగా నిలిచే గురువులను మనకు గైడెన్స్ ఇచ్చే గురువులను కాపాడుకోవాలి అంటూ హ్యాపీ టీచర్స్ డే ట్వీట్ చేశాడు.

టీచర్స్ డే సందర్బంగా ఇంకా పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. వరుణ్ తేజ్ ఇప్పటి వరకు తాను పని చేసిన దర్శకుల ఫొటోలు చేసి నేను నటించిన సినిమాల దర్శకులు అంతా కూడా నాకు గురువులే. వారికి ఈ సందర్బంగా హ్యపీ టీచర్స్ డే అంటూ విభిన్నంగా ట్వీట్ చేశాడు. సాయి ధరమ్ తేజ్.. టీచర్స్ గైడెన్స్ మరియు వారు మంచి మార్గంలో పెట్టడం వల్లే విద్యార్థులు ఉన్నతవంతులు అవుతున్నారంటూ ట్వీట్ చేశాడు. ప్రకాష్ రాజ్ కూడా టీచర్స్ డే సందర్బంగా ఎమోషనల్ ట్వీట్ చేశాడు.