ఇలా చూస్తే ఉద్రేకం కలగడం లేదన్న పవన్ హీరోయిన్

0

పవన్ కళ్యాణ్ ‘బంగారం’ సినిమాలో ఆ తర్వాత ఒకటి రెండు తెలుగు సినిమాల్లో కనిపించిన ముద్దుగ్మ మీరా చోప్రా గుర్తు ఉంది కదా. ఈమె ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా రెగ్యలర్ గా పోస్ట్ లు పెట్టడం సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈమె కరోనా లాక్ డౌన్ వల్ల సినిమాలు ఓటీటీలో విడుదల అవ్వడంపై స్పందించింది. నిర్మాతలు కాస్త వెయిట్ చేసి థియేటర్లలో సినిమాలు విడుదల చేయాలంటూ మీరా చోప్రా విజ్ఞప్తి చేసింది.

సినిమా థియటర్లలో సినిమాను చూడటం వల్ల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తుంది. కాని ఓటీటీలో చూడటం వల్ల ఆ ఉద్రేకంను మిస్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో థియేటర్లు ఓపెన్ అవ్వబోతున్నాయి. కనుక అప్పటి వరకు వెయిట్ చేస్తే బాగుంటుంది కదా అంటూ మీరా చోప్రా విజ్ఞప్తి చేసింది. ఓటీటీలో సినిమాలు విడుదల చాలా కాలం నుండే ఉంది. థియేటర్లలో విడుదల అయిన తర్వాత కూడా ఓటీటీలో విడుదల చేసుకోవచ్చు.

కొత్త సినిమాలను ఓటీటీ రిలీజ్ చేయవద్దని థియేటర్లు ప్రారంభం అయ్యే వరకు వెయిట్ చేయాలంటూ ఆమె పేర్కొంది. థియేటర్లు పునః ప్రారంభంకు ఎంత లేదన్న నెల పట్టనుంది.. జనాలు మళ్లీ థియేటర్లకు వచ్చేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో ఓటీటీ విడుదలకు రెడీ అవుతున్నారు. అయితే పెద్ద సినిమాలు మాత్రం ఓటీటీకి ఇంకా వెళ్లడం లేదు. మీరాచోప్ర వాదన నిజమే అయినా నిర్మాతలు ఆర్థిక పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా అంటూ నెటిజన్స్ మీరాకు కామెంట్స్ చేస్తున్నారు.