కరోనాను ఇలా జయించానంటున్న నాగబాబు

0

మెగా బ్రదర్ నటుడు నిర్మాత నాగబాబు ఇటీవల కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే.. ఆయన పలు టీవీ షోలను చేస్తున్నారు. ఆ క్రమంలోనే కరోనా బారినపడ్డారని తెలిసింది. కాగా గత 14 రోజులుగా చికిత్స తీసుకుంటున్న నాగబాబు తాను కరోనాను జయించానని తాజాగా తెలిపారు. హోం ఐసోలేషన్ తర్వాత తాను ఎదుర్కొన్న అనుభవాలు తీసుకున్న జాగ్రత్తలు కోలుకున్న విధానాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.

ఇటీవల తాను ఐదు సార్లు కరోనా టెస్ట్ చేయించుకున్నానని.. నిహారిక నిశ్చితార్థానికి ముందు కూడా ఫ్యామిలీ అంతా చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందని నాగబాబు తెలిపారు. కానీ తాజాగా కాస్త చలి జ్వరం మత్తుగా అనిపించడంతో టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చిందని నాగబాబు తెలిపారు.

కరోనా అనగానే మొదట ఆందోళనకు గురయ్యానని.. ఆస్పత్రికి వెళ్లి అవసరమైన పరీక్షలు చేయించుకున్నానని.. నాకు గతంలో న్యూమోనియా ఉండడంతో ఆస్పత్రిలో చేరగా.. ఐదురోజులు రెమిడెసివిర్ ఔషధాన్ని ఇచ్చారని నాగబాబు తెలిపారు. జ్వరం ఒళ్లు నొప్పులు తప్ప ఎటువంటి ఇబ్బంది నాకు కలుగలేదని నాగబాబు తెలిపారు.

కరోనాకు ఎవరూ అతీతులు కారని.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది వస్తుందని నాగబాబు తెలిపారు. జ్వరం దగ్గు జలుబు ఉంటే వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోండని నాగబాబు తెలిపారు. కరోనాకు మందు లేదని.. వైరస్ లోడును బట్టి చికిత్స అందిస్తారని.. కరోనా వైరస్ 14 రోజుల తర్వాత దానంతట అదే చచ్చిపోతుందని నాగబాబు తెలిపారు. 14 రోజుల తర్వాత వైరస్ ఉన్నా మనకు హాని కలిగించదని అన్నారు. తాను ఫ్లాస్మా దానం చేస్తానని నాగబాబు తెలిపారు. అందరూ కంగారు పడవద్దనే ఈ వీడియో పంచుకున్నానని నాగబాబు తెలిపారు.