మంచి మనసు చాటుకున్న బాలయ్య

0

నందమూరి బాలకృష్ణ మాట కఠువు అయినా మనసు చిన్న పిల్లల మనసు అని ఆయన మనసు బంగారం అంటూ అభిమానులు అంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటూనే ఉన్న బాలకృష్ణ తాజాగా మరోసారి తనలోని మానవత్వంను చాటుకున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన తెలుగు దేశం పార్టీ కార్యకర్త నరసింహప్ప యాక్సిడెంట్ లో మృతి చెందారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీ కార్యకర్తగా పని చేస్తున్న ఆయన మృతితో కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు అనే విషయంను తెలుసుకున్న బాలకృష్ణ వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నరసింహప్ప కుటుంబ సభ్యులతో స్వయంగా బాలకృష్ణ ఫోన్ లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు స్వయంగా నరసింహప్ప ఇంటికి వెళ్లి బాలయ్య అందించిన సాయంను వారికి ఇవ్వడంతో పాటు బాలయ్యతో మాట్లాడించారు. ఆ సమయంలో బాలయ్య మాట్లాడుతూ పిల్లల చదువుకు కావాల్సిన సాయంను తాను చేస్తాను అంటూ హామీ ఇచ్చాడు. బాలయ్య హామీతో నరసింహప్ప కుటుంబ సభ్యులకు చాలా ఊరట లభించింది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి మరియు నందమూరి ఫ్యామిలీని అంటి పెట్టుకుని ఉండే వారికి బాలయ్య అండ దండలు ఎప్పుడు ఉంటాయని ఆయన సన్నిహితులు మరియు అభిమానులు అంటున్నారు.

ఇక బాలకృష్ణ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఒక వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా మరో వైపు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయినా కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. అతి త్వరలో మళ్లీ షూటింగ్ పునః ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. బోయపాటి తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమాకు బాలయ్య రెడీగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆ మూవీ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.