కంగనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి నీ నిజాయితీ నిరూపించుకో

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా గత కొన్నాళ్లుగా మహారాష్ట్ర ప్రభుత్వంను సుశాంత్ మృతి కేసు మరియు డ్రగ్స్ కేసు విషయంలో విమర్శిస్తూ వచ్చిన విషయం తెల్సిందే. ముంబయి పోలీసులు బాలీవుడ్ లో కొందరికి సహకరిస్తూ సుశాంత్ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ గత మూడు నాలుగు నెలలుగా ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. ఆమె ఏకంగా శివసేన పార్టీ మరియు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను ఢీ కొన్న విషయం తెల్సిందే. అందుకు ప్రభుత్వం ఆమె ఆఫీస్ అక్రమ కట్టడం అంటూ నేల మట్టం చేయడం కూడా జరిగి పోయింది. ఒకానొక సమయంలో ముంబయిలో కంగనా ఎలా అడుగు పెడుతుందో చూస్తాం అంటూ శివసేన కార్యకర్తలు హెచ్చరించారు. దాంతో ఆమెకు కేంద్రం ప్రత్యేకమైన భద్రతను కల్పించింది.

ముంబయిలో అడుగు పెట్టి తన సత్తా చాటుతాను అంటూ శివసేనను మరియు ప్రభుత్వంను హెచ్చరించిన కంగనా అన్నట్లుగానే ముంబయిలో నానా హంగామాతో అడుగు పెట్టింది. సుశాంత్ మరియు డ్రగ్స్ కేసు విషయంలో నానా రచ్చ చేసిన కంగనా రనౌత్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సంచలనాత్మక ఉత్తరప్రదేశ్ హథ్రాస్ అత్యాచారంపై ఎందుకు స్పందించడం లేదు అంటూ శివసేన కార్యకర్తలు మరియు కొందరు నెటిజన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కనుక.. ఆమె బీజేపీ ప్రభుత్వంకు మద్దతుదారు కనుక ఆమె ఆ అత్యాచార ఘటనపై మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

సుశాంత్ మృతి చెందినప్పటి నుండి ప్రతి రోజు మీడియాలో కనిపించిన కంగనా ఇప్పుడు మాత్రం దళిత యువతి పై కనీసం రెండు కన్నీటి బొట్టు రాల్చేలేదు అంటే ఇన్ని రోజులు ఆమె ఏ ఉద్దేశ్యంతో గొడవ చేసిందో అర్థం చేసుకోవచ్చు అంటూ శివసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఎద్దేవ చేస్తున్నారు. నెటిజన్స్ సైతం కంగనాను ఈ విషయమై ప్రశ్నిస్తున్నారు. దళిత యువతి మృతిపై మీరు ఎందుకు స్పందించడం లేదు. ప్రభుత్వంను హథ్రాస్ ఘటనపై ప్రశ్నించి మీ నిజాయితీ మరియు మానవత్వంను నిరూపించుకోవాలంటూ నెటిజన్స్ సూచిస్తున్నారు. ప్రస్తుతం తలైవి షూటింగ్ కోసం హైదరాబాద్ లో కంగనా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. శివసేన విమర్శలకు కంగనా ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. హథ్రాస్ ఘటనపై ఆమె స్పందించక పోవడం ఖచ్చతంగా తప్పే అన్నట్లుగా ఆమె అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.