Templates by BIGtheme NET
Home >> Cinema News >> నెటిజన్లకు హీరోయిన్ బంపర్ ఆఫర్.. స్నానం చేస్తున్న ఫోటోతో..!!

నెటిజన్లకు హీరోయిన్ బంపర్ ఆఫర్.. స్నానం చేస్తున్న ఫోటోతో..!!


టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ పొందిన కన్నడ బ్యూటీ ప్రణీత. ఈ ముద్దుగుమ్మ 2010లో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ అనే సినిమాతో తెలుగులో హీరోయినుగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బావ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాలలో మెరిసింది. కానీ మాక్సిమం ప్రణీత సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లే పోషించింది. అత్తారింటికి దారేది తర్వాత ప్రణీత నటించిన సినిమాలేవి పెద్దగా హిట్ కాలేదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఆఫర్స్ కూడా పెద్దగా లేవు. కాని కరోనా సంక్షోభంలో తనకి ఉన్నంత దానిలో సాయం చేస్తూ అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకుంది భామ. కరోనా బాధితుల కోసం తెలుగు సినిమా పరిశ్రమ నుండి హీరోయిన్స్ లో మొదటి విరాళంను ప్రకటించిన ప్రణీత.. తన ఇంటి చుట్టుపక్కన ఆకలితో అలమటించే వారి కోసం స్వయంగా వంట చేసి వారి ఆకలి తీర్చిందట.

ఇక అత్తారింటికి దారేది తర్వాత కమర్షియల్ బ్రేక్ రాకపోవడంతో టాలీవుడ్లో ప్రణీతకు అవకాశాలు రాలేదని చెప్పాలి. అలాగని తన మాతృభాష కన్నడలో కూడా ప్రణీతను గుర్తించిన వారు లేరు. సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి సహజమే. బ్రేక్ వచ్చేవరకు వేచి ఉండాల్సిందే. ఇలా వెయిట్ చేస్తూనే తన దృష్టిని మోడలింగ్ లో పెడుతున్నట్లుంది. అయితే ఇటీవల ఈ భామ చేసిన ఒక చిలిపి పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ప్రణీత ఇంస్టాగ్రామ్ వేదికగా తన అభిమానులకు ఒక ఆఫర్ ఇచ్చింది. ఎలాంటి ఫోటో అయినా అడగండి పంపిస్తాను అని. అంతే అందమైన భామ ఇలాంటి ఆఫర్స్ ఇస్తే ఊరుకుంటారా.. అందులో ఆమెను ఒకరు ‘మీరు ఇంతవరకు పోస్ట్ చేద్దాం అనుకోని పోస్ట్ చేయని పర్సనల్ పిక్ పంపండి’ అని అడిగాడట. అంతే అమ్మడు కాదనకుండా.. బాత్ టబ్ లో స్నానం చేస్తున్నపుడు దిగిన పిక్ పెట్టింది. అంతే అలా పిక్ పెట్టిందో లేదో.. నెటిజన్లు అలా లైక్ షేర్ అంటూ వైరల్ చేసేస్తున్నారు. అది మరి గ్లామర్ ప్రియులకు కావాల్సింది దొరికితే అంతేకదా..!!