న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ‘ఆచార్య’ ‘వైల్డ్ డాగ్’ నిర్మాతలు…!

0

‘క్షణం’ ‘ఘాజీ’ ‘గగనం’ వంటి విభిన్న తరహా చిత్రాలను నిర్మించిన నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి లు ఇప్పుడు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మరో వైవిధ్యభరితమైన చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జె ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. స్వరూప్ రెండవ సినిమాగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో 8వ చిత్రంగా రానున్న ఈ మూవీ అనౌన్సమెంట్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఓ గోడ పై కోడిపుంజు నిలుచొని ఉండగా.. గోడపై వాంటెడ్ పోస్టర్ అతికించబడి ఉంది. అతన్ని పట్టుకున్న వారికి 50 లక్షల రివార్డ్ అని ప్రకటించబడి ఉంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో విమర్శకుల ప్రసంశలు పొందిన స్వరూప్ ఆర్ఎస్జె మరోసారి డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడని అర్థం అవుతోంది.

కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు రూపొందిస్తున్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ వారు ఈ సినిమాలో లీడ్ రోల్స్ కోసం ఎవరిని తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాని డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో నటించబోయే నటీనటులు సాంకేతిక నిపుణులు మరియు ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఇదిలా ఉండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా ‘వైల్డ్ డాగ్’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాల నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.