‘కొమరం భీమ్’ ఫస్ట్ లుక్ ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి…!

0

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. స్టార్ట్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన రామరాజు రామ్ చరణ్ ఇంట్రో వీడియో విశేషంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో చరణ్ పాత్ర హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ సాగిన ఆ వీడియో సినీ అభిమానులకి మంచి అనుభూతిని పంచింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ పుట్టిన రోజున ఆయన ఫస్ట్ లుక్ మరియు ఇంట్రో వీడియో రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదని ‘ఆర్.ఆర్.ఆర్’ యూనిట్ ప్రకటించింది. ఇక అప్పటి నుంచి అభిమానులు తారక్ అప్డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఇటీవలే కరోనా నుంచి బయటపడిన రాజమౌళి ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి రానున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మరియు ఇంట్రో వీడియోపై క్లారిటీ ఇచ్చాడు. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజులు షూటింగ్ కి వెళ్లకూడదని అనుకుంటున్నాని.. ఒకవేళ షూటింగ్ స్టార్ట్ అయితే పది రోజుల తర్వాత తారక్ కి సంబంధించిన విజువల్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్ అప్డేట్ ఇస్తామని రాజమౌళి స్పష్టం చేశారు. దీంతో ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని తారక్ అభిమానులు ఉత్సాహంతో వెయిట్ చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.