ఆ ఊరికి ఇంటర్నెట్.. సోనూ సూద్ మరో ఔదార్యం

0

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సేవా తత్పరతలో దేశంలోనే సాటిలేకుండా ముందున్నారు. ఎవ్వరూ ఏమీ అడిగినా కాదనకుండా ఇచ్చేస్తున్నారు. చేతికి ఎముకే లేకుండా ఆయన సాయం చేస్తున్నారు.

తాజాగా ఆ ఊళ్లో ఇంటర్నెట్ రాక కొండపైకి వెళ్లి చదువుకుంటున్న స్వాప్నిల్ అనే విద్యార్థిని బాధను సోనూ సూద్ అర్థం చేసుకున్నాడు. ఆమె వివరాలు అడిగి మరీ తెలుసుకొని వాళ్ల ఊరికి వైఫై సౌకర్యం కల్పిస్తానని తాజాగా భరోసానిచ్చాడు.

మహారాష్ట్రలోని సింధూ దుర్గ్ కు చెందిన స్వాప్నిల్ ఊళ్లో సిగ్నల్ రాకపోవడంతో సోదరుడితో కలిసి 2 కి.మీ ల దూరంలోని కొండపైకి వెళ్లి చిన్నగుడిసె వేసుకుంది. అక్కడే ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతోంది.

ఆమె బాధను సోషల్ మీడియాలో చూసిన సోనూ సూద్ తాజా చలించి ఆ ఊరికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తానని మాట ఇచ్చాడు.