‘పుష్ప’ విజయ్ సేతుపతి రిప్లేస్ పై సుక్కు కొత్త ప్లాన్

0

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందబోతున్న పుష్ప సినిమా ఇప్పటి వరకు షూటింగ్ మొదలు కాకున్నా కూడా అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాడు.. అలాగే సుకుమార్ సైతం తన చివరి సినిమా రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఈ కారణాల వల్ల వీరి కాంబో మూవీపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఏడాది కాలంగా అభిమానుల్లో అంచనాలు పెంచే విధంగా పుష్ప గురించిన వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్రకు గాను తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని ఎంపిక చేయడం జరిగింది.

షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా డేట్లు కుదరక పోవడంతో విజయ్ సేతుపతి సినిమా నుండి తప్పుకున్నాడు. కథ పాత్ర చాలా నచ్చినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను వదిలేయాల్సి వచ్చింది అంటూ ఒక ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి స్వయంగా చెప్పుకొచ్చాడు. చాలా రోజులుగా ఆయన వదిలేసిన పాత్రను ఆ హీరో చేయబోతున్నాడు ఈ హీరో చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఉపేంద్ర నుండి మొదలుకుని నారా రోహిత్ వరకు పలువురు నటులను సంప్రదించినట్లుగా ప్రచారం జరిగింది.

చివరకు ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అయితే బాగుంటుందనే అభిప్రాయానికి సుకుమార్ వచ్చాడట. పుష్ప సినిమాను ఎలాగూ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని భావిస్తున్నాం. కనుక ఆ ముఖ్యమైన పాత్రకు బాలీవుడ్ స్టార్ ను నటింపజేస్తే బాగుంటుంది కదా అంటూ యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ పునః ప్రారంభం కాబోతుంది. కనుక ఆ పాత్రకు త్వరలోనే ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది అంటున్నారు.