తెలుగు భామే.. కానీ సొగసులో ముద్దుగుమ్మేనట..!!

0

టాలీవుడ్ యువ హీరోయిన్ ప్రియ వడ్లమాని తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే పరిచయం అవుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ లో పుట్టిన ఈ భామ.. బేసిగ్గా తెలుగు కుటుంబానికి చెందింది. ఇక హైదరాబాద్ లోనే పెరిగిందట. ప్రాథమిక విద్యను హైదరాబాద్ లోనే పూర్తిచేసి బెంగళూరులో ఉన్నత విద్యను పూర్తి చేసిందట. ఇక మొదటి నుండి అమ్మడికి సినిమా రంగం పై ఇంటరెస్ట్ ఉండి మోడలింగ్ లోకి ప్రవేశించింది. అలా 2016లో ఫెమినా మిస్ ఇండియా హైదరాబాద్ పోటీలలో పాల్గొంది. ఎందరో స్టార్ హీరోయిన్లుగా సినీ ఇండస్ట్రీలో ఎదుగుదాం అనుకుంటున్న అమ్మాయిలలో ప్రియా ఒకరు. నిజానికి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలే కరువు. ఎక్కడెక్కడి నుండో హీరోయిన్లను తీసుకొచ్చి సినిమాలు తీస్తుంటారు కానీ ఇక్కడే ఉన్న తెలుగు అందాలను మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఇండస్ట్రీలో యాక్ట్రెస్ అయిపోవాలనే ఆశతో ప్రియ వడ్లమాని మొదటగా సహాయ దర్శకురాలిగా పనిచేసిందట.

ఆ తర్వాత 2018లో ‘ప్రేమకు రెయిన్ చెక్’ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయినుగా అడుగు పెట్టింది. ఇక అదే ఏడాది అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. వరుసగా శుభలేఖలు హుషారు సినిమాలు చేసింది. ఇక హుషారు సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. అమ్మడు సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేయడానికి సిద్ధంగా ఉందట. అలాగే గ్లామర్ పరంగా స్కిన్ షో పరంగా అయితే ఎలాంటి హద్దులు లేనట్లే అనిపిస్తుంది. హుషారు సినిమాలో ప్రియా రొమాంటిక్ సన్నివేశాలలో కూడా మెప్పించింది. నిజానికి ఆ సినిమాలో ప్రియ గ్లామర్ కాస్త యువతకు కనెక్ట్ అయింది అనుకోండి. ఆ తర్వాత ఆవిరి సినిమాలో చివరగా కనిపించింది ప్రియా. మరి మళ్లీ ఇంతవరకు ఆమె నుండి ఏ సినిమా రాలేదు. ఇక సోషల్ మీడియాలో ప్రియాకు ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇంస్టాగ్రామ్ లో వరుసగా తన గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును లైన్లో పెడుతోంది. తెలుగు భామే.. కానీ సొగసులో ముద్దుగుమ్మే అంటున్నారు నెటిజన్లు. చూడాలి మరి త్వరలో ఏదైనా సినిమాలో మెరుస్తుందేమో..!!