హీరో ఫేస్బుక్ పోస్టుకు మాజీ భార్య ఫిదా.. విడాకులు రద్దు చేయాలంటూ కోర్టుకు

0

రెండేళ్ల క్రితం విడిపోయిన ఓ జంట ఇప్పడు తమ డైవర్స్ను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. తాము విడాకులు తీసుకున్నప్పటికీ సంతోషంగా లేమని.. ప్రస్తుతం తాము కలిసి ఉండాలనుకుంటున్నామని ఆ జంట కోర్టుకు అభ్యర్థించింది. మై తేరా హీరో జిస్మ్ 2 మొహంజోదారో సికిందర్ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన అరుణోదయ్ సింగ్.. కెనడాకు చెందిన లీ ఎల్టన్ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. 2016 డిసెంబర్లో పెద్దల సమక్షంలో వీరి వివాహం అయ్యింది. అయితే పెళ్లయ్యాక భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. పెంపుడు కుక్కల విషయంలో వీళ్లిద్దరూ గొడవపడ్డారు. అనంతరం విడాకులు కోసం కోర్టుకు వెళ్లగా.. 2019 లో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అప్పట్లో వీరి విడాకులు పెను సంచలనంగా మారింది. ఈ పోస్టు ఎంతో వైరల్ అయింది. లీ కెనడాకు వెళ్లిపోయింది. అయితే తాజాగా తమ విడాకులను రద్దు చేయాలంటూ అరుణోదయ్ భార్య లీ ఎల్టన్ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు వ్యతిరేకంగా నమోదైన అభియోగాలు తీవ్రమైనవి కావని వెంటనే డివోర్స్ను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని లీ విజ్ఞప్తి చేశారు.

కేసును విచారించిన న్యాయస్థానం.. పూర్తి వివరాలను తమకు సమర్పించాలంటూ కోర్టు లీ ని ఆదేశించింది. ఈ కేసును అక్టోబర్ 6కు వాయిదా వేసింది. కాగా ప్రేమపెళ్లి చేసుకున్న అరుణోదయ్ గత ఏడాది డిసెంబర్లో తన వైవాహిక జీవితం గురించి ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఓ పోస్ట్ అప్పట్లో వైరల్ అయ్యింది. ఈ పోస్టును చదివిన లీ ఫిదా అయ్యిందట. దీంతో ఆమెకు మళ్లీ ప్రేమ చిగురించిదట. ఏది ఏమైనా చిన్నచిన్న విషయాలకే ప్రస్తుతం కొందరు దంపతులు విడాకులు తీసుకుంటుండగా.. విడిపోయిన ఏడాదికి వీరి మధ్య ప్రేమచిగురించడం గొప్పవిషయమే.