కంగన దెబ్బకు శివసేన ఔట్

0

బాలీవుడ్ నటుడు సుశాంత్ చుట్టూ ఎన్నో అనుమానాలు.. ఆ అనుమానాలకు బలం చేకూరేలా ఎన్నో మలుపులూ.. అయితే ఈ క్రమంలోనే బాలీవుడ్ లోని నెపోటిజం.. ఇతర వ్యక్తులను తొక్కేసే అగ్ర సినీ ప్రముఖుల బండారాలు బయటపడుతున్నాయి. దీనిపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా నిప్పులు చెరుగుతున్నారు. బాలీవుడ్ ప్రముఖులను మహారాష్ట్ర సర్కార్ ను టార్గెట్ చేసి ఉతికి ఆరేస్తున్నారు.

కంగనా రౌనత్.. ఇప్పుడు ఈ ఫైర్ బ్రాండ్ పేరు చెబితేనే బాలీవుడ్ షేక్ అవుతోంది. మహారాష్ట్రలోని శివసేన సర్కార్ షాక్ అవుతోంది. ముక్కుసూటిగా ఈమె చేస్తున్న విమర్శలు బాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మహారాష్ట్రలో జరుగుతున్న బాగోతాలపై కంగనా నిప్పులు చెరుగుతోంది

కంగనా రౌనత్ పెట్టే ట్వీట్లకు వ్యాఖ్యలకు బాలీవుడ్ లోనే కాదు.. మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా వణుకుపడుతోందట.. అందుకే ఇప్పుడు కంగన మీద శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అందుకే కంగనను టార్గెట్ చేశాడని అర్థం అవుతోందంటున్నారు. కంగనకు శివసేన భయపడుతోందని.. సుశాంత్ సింగ్ కేసు గురించి.. పోలీస్ విచారణ గురించి.. బాలీవుడ్ డ్రగ్స్ గురించి మాట్లాడేత శివసేన ఎంపీకి ఎందుకు నొప్పి అని కొందరు ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

సుశాంత్ సింగ్ కేసుకు… బాలీవుడ్ లో ఉన్న పెద్దలకు.. శివసేనలో ఉన్న పెద్దలకు లింక్ ఉంది కాబట్టి మహారాష్ట్రలో కేసు ముందుకు కదలడం లేదని ప్రచారం సాగుతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇన్ వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చిందని కూడా అంటున్నారు. చూద్దాం.. సుశాంత్ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో..