భయానికి మీనింగ్ తెలియని ఓన్లీ వన్ కింగ్!

0

మహమ్మారీకి భయపడి ఇండస్ట్రీ అగ్ర హీరోలెవరూ షూటింగుల్లో పాల్గొనడం లేదు. ముఖ్యంగా 60 ప్లస్ లో ఉన్న హీరోలు అయితే మరీ భయపడుతున్నారు. చిరంజీవి- వెంకటేష్- బాలకృష్ణ ఇప్పట్లో షూటింగులేవీ పెట్టుకోవడం లేదు. కానీ వీళ్లందరి కంటే భిన్నంగా ఆలోచిస్తున్నారు కింగ్ నాగార్జున. ఆయన మొన్ననే 31వ బర్త్ డే (అంటే 61) జరుపుకున్నారు.

అయినా ఆయన ఓవైపు బిగ్ బాస్ షూటింగ్ చేస్తున్నారు. మరోవైపు వైల్డ్ డాగ్ మూవీ షూటింగులోనూ పాల్గొంటున్నారు. భయానికే భయం నేర్పిస్తున్నారు. కింగ్ ఇప్పటికే బిగ్ బాస్ 4 ప్రోమోల షూటింగ్ ప్రారంభించాడు. వచ్చే వారాంతం నుండి సెట్ కి చేరనున్నారని సమాచారం.

వైరస్ మహమ్మారి కారణంగా టాలీవుడ్ మొత్తం షూటింగును తిరిగి ప్రారంభించడం గురించి ఆందోళన చెందుతుంటే ఆయన మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నాగ్ తన తదుపరి చిత్రం వైల్డ్ డాగ్ హైదరాబాద్ లోనే చిత్రీకరణను తిరిగి ప్రారంభించారు. సుదీర్ఘ షెడ్యూల్ విరామం లేకుండా కొనసాగుతోంది. అయితే సెట్స్ లో ఎలాంటి ఇబ్బందీ లేకుండా సిబ్బందిని సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు చేశారు.

నాగార్జున ఈ చిత్రంలో ఒక ఎన్ఐఏ అధికారిగా నటిస్తున్నారు. టాకీ భాగం పూర్తి చేసి తదుపరి యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారని సమాచారం. నిజానికి ఈ మూవీని మొదట బ్యాంకాక్ లో చిత్రీకరించాలని అనుకున్నారు దర్శకుడు సోలమన్. కానీ కుదరలేదు. దియా మీర్జా ఈ చిత్రంలో కథానాయిక. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. అక్టోబర్ చివరి నాటికి షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.