హైదరాబాద్ లో పూజా సొంత ఇంటి ప్రయత్నం!

0

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రస్తుతం ఎవరైనా వున్నారా? అంటే వెంటనే వినిపించే పేరు పూజాహెగ్డే. అందం.. అభినయం.. సక్సెస్ లాంటివి పక్కన పెడితే వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్ జాబితాలో చేరిపోయిందీ పొడుగు కాళ్ల సుందరి. బన్నీతో ఈ ఏడాది ప్రారంభంలో `అల వైకుంఠపురములో`తో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇదే ఊపులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు జోడీగా `రాధేశ్యామ్`లో నటిస్తోంది.

అక్కినేని అఖిల్ తో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రంలో నటిస్తన్న పూజా హెగ్డే కరోనా క్రైసిస్ వున్నా పారితోషికం విషయంలో ఎక్కడా తగ్గనంటోంది. గతానికి మించి భారీగానే తన పారితోషికాన్ని పెంచేసి ప్రొడ్యూసర్స్ కి షాకిచ్చిన పూజా హెగ్డే దక్షిణాది చిత్రాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటోందట. ప్రస్తుతం ముంబైలో వుంటున్న పూజా హైదరాబాద్ లోనూ సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ బుట్టబొమ్మకి తెలుగు.. తమిళ భాషల్లో వరుసగా ఆఫర్లు వస్తుండటంతో ఇక్కడే మకాం పెట్టాలని భావిస్తోందట. ట్రిపుల్ బెడ్రూమ్ లగ్జరీ ఫ్లాట్ ని కొనుగోలు చేయాలన్న ప్రయత్నాల్లో వుందట. ఎక్కడ ఏ ఏరియా అన్నది మాత్రం ఇంకా పూజ బయటపెట్టలేదు. అల్ మోస్ట్ జూబ్లీ హిల్స్ ఏరియాలోనే పూజా ఓ ఫ్లాట్ ని తీసుకోబోతోందని మాత్రం ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.