పవర్ స్టార్ సరసన పూజా జతకట్టనుందా..??

0

తెలుగు చిత్ర పరిశ్రమలో షాక్ సినిమాతో దర్శకుడిగా మారాడు హరీష్ శంకర్. 2011లో ‘మిరపకాయ్’తో మంచి హిట్ అందుకొని ఆ వెంటనే ‘గబ్బర్సింగ్’తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ గతేడాది ‘గద్దలకొండ గణేష్’ సినిమాలతో మంచి జోష్ లో ఉన్నాడు. గద్దలకొండ గణేష్ తర్వాత హరీష్ శంకర్తో ఫస్ట్ కాంబినేషనే సూపర్ హిట్ కావడంతో ఆయనతో మరోసారి సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారు. అలా ఆయన ఓకే చెప్పాడో లేదో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిన్న షెడ్యూల్ మిగిలి ఉందట. త్వరలోనే పూర్తిచేద్దాం అనుకునేలోపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసింది. అందుకే షూటింగ్స్ ఆపేసి ఎక్కడి వారక్కడే ఇళ్లకు పరిమితమయ్యారు. పవర్ స్టార్ కూడా వకీల్ సాబ్ షూటింగులో ఉండగానే మరో కొన్ని ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టాడు.

అందులో ఒకటి ఈ హరీష్ శంకర్ సినిమా. ఇది పవన్ 28వ సినిమా. పవన్ నుండి మొదటగా వకీల్ సాబ్ విడుదల కానుంది. ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ తో ‘విరూపాక్ష’. ఆ పిదప హరీష్ శంకర్ సినిమాలు వస్తాయని అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మహమ్మారి వలన బ్రేక్ పడటంతో వకీల్ సాబ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. ఇదిలా ఉండగా మరి హరీష్ సంగతి ఏంటి అని చర్చ నడుస్తుంది. అయితే హరీష్ మాత్రం కేవలం పవన్ సినిమా పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇదివరకే పవన్ సినిమా అయ్యేవరకు వేరే సినిమా ముట్టుకోనని చెప్పాడు. అంతేగాక తను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే అని గుర్తుచేశాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే చర్చ కూడా నడుస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో పవన్ సరసన పూజా హెగ్డే నటించనుందని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఇక హరీష్ కూడా పూజా వైపు మొగ్గు చూపుతున్నాడని టాక్. ప్రస్తుతం ఈ వార్తతో అటు పవన్ ఫ్యాన్స్ పూజా ఫ్యాన్స్ పక్కా ఫుల్ ఖుషి అవుతున్నారు.