సామ్ నుంచి ఏదైనా శుభవార్త వస్తుందని!

0

అక్కినేని కోడలు సమంత టాలీవుడ్ బెస్ట్ ఫ్యాషనిస్టాగా రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. సామ్ ఇన్ స్టా లుక్స్ పై నిరంతరం యువతరంలో ఆసక్తికర చర్చ సాగుతుంటుంది. ఎప్పుడు ఏ కొత్త మోడల్ డిజైనర్ లుక్ బయటకు వచ్చినా ఆ ఔట్ ఫిట్ లో సామ్ మెరిసిపోతుంటుంది. బాలీవుడ్ స్టార్లు అనుష్క శర్మ.. సోనమ్ కపూర్ తర్వాత సౌత్ నుంచి అంతగా పాపులరైంది సామ్.

ఇక ఇటీవల ఉపాసన కామినేని తో కలిసి ఓ కార్యక్రమం కోసం స్పెషల్ ఫోటోషూట్ తో అదరగొట్టేసింది. ఇదే గాక ఓ కవర్ పేజీలో సామ్ ఔట్ ఫిట్ సంథింగ్ స్పెషల్ గా ఆకర్షిస్తోంది. అన్నట్టు సామ్ ని ఈ వైట్ అండ్ వైట్ డిజైనర్ లుక్ లో చూడగానే ఏదైనా శుభవార్త చెబుతోందా? హబ్బీతో కలిసి తన ఫేవరెట్ అనుష్క శర్మలా ఆ శుభవార్త చెప్పేస్తుందా? అంటే ఒకటే కామెంట్లు పడిపోతున్నాయ్.

ఇక కెరీర్ సంగతి చూస్తే .. సమంత ప్రస్తుతం నయనతారతో కలిసి విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తోంది. అదేగాక.. మాయ .. గేమ్ ఓవర్ దర్శకుడు అశ్విన్ శరవణన్ సమంతా అక్కినేనితో కొత్త చిత్రం చేయనున్న సంగతి తెలిసినదే. అయితే ఆ మూవీ ఆగిపోయిందని కథనాలొస్తున్నాయి. అయితే ఇది నిజమా? అని దర్శకుడిని ప్రశ్నిస్తే.. అందులో ఎలాంటి నిజం లేదని కనీసం దర్శకనిర్మాతల్ని అయినా అడక్కుండా అలా రాసేస్తారా? అంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. కరోనా మహమ్మారీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నామని .. త్వరలో సెట్స్ కెళతామని తెలిపారు. ఇక ఇందులో సమంత బదులుగా తాప్సీ నటిస్తుంది అన్నదాంట్లో కూడా ఎలాంటి నిజం లేదు.

అశ్విన్ చిత్రంలో నటిస్తున్నానని సమంత ఇంతకుముందు ధృవీకరించింది. అయితే .. మహమ్మారి కారణంగా.. షూట్ ఇంకా ప్రారంభం కాలేదు. సోనీ పిక్చర్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సమంతాతో పాటు స్నేహ భర్త ప్రసన్న ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అన్నీ సరిగ్గా కుదిరితే ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం ఈ సంవత్సరం చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే వీలుంది.