రెండోసారి కరోనా రాదని లైట్ తీస్కున్న బండ్లకు షాక్!

ఇది నిజంగా షాకింగ్ విషయం. ఒకసారి కరోనా పాజిటివ్ అని తేలాక చికిత్సతో కోలుకున్న నటుడు నిర్మాత బండ్ల గణేష్ కి మరోసారి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతడు అపోలోలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే వకీల్ సాబ్ సక్సెస్ వేదికపై బండ్ల గణేష్ ప్రసంగం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ అనంతరం ఇంటికి వచ్చేశాక గణేష్ కి జ్వరం వచ్చిందట. అయితే రెండోసారి కరోనా వచ్చేందుకు ఆస్కారం లేదని భావించి లైట్ తీస్కున్నారు. […]

అమెరికాను వణికించేస్తున్న కరోనా సెకండ్ వేవ్

కరోనా వైరస్ సెకండ్ వేవ్ అగ్రరాజ్యం అమెరికాను వణికించేస్తోంది. గురువారం ఒక్కరోజే అగ్రరాజ్యంలో 3054 మంది కరోనా మహమ్మారికి బలైపోయారు. అమెరికా చరిత్రలో ఒక్కరోజులో ఇంతమంది మరణించటం ఇదే మొదటాసారి కావటం సంచలనంగా మారింది. గతంలో కూడా కరోనా వల్ల చాలామంది మరణించారు. అయితే గతంలో ఒక్కరోజులోనే వైరస్ కారణంగా మరణించిన వారిసంఖ్య 2769. అప్పట్లోనే ఇంతమంది మరణించటం అమెరికాలో కలకలం రేపింది. అందుకనే అప్పటికంటే ఇపుడు అదనంగా సుమారు 300 మంది మరణించటంతో అమెరికా వణికిపోతోంది. […]

కోలుకున్న వ్యక్తికి మళ్లీ కరోనా..! శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ నిజం

ఒకసారి కరోనా వచ్చి కోలుకున్నాక దాదాపు 3 నెలలపాటు కరోనా మళ్లీ రాదని ఇప్పటివరకు వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు. కానీ అది అబద్ధమని తేలిపోయింది. ఒక సారి కరోనా వచ్చి తగ్గాక నెలతిరగకుండానే మళ్లీ ఈ మహమ్మారి సోకే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా వచ్చిన వ్యక్తిలో యాంటీ బాడీలు వేగంగా క్షీణించడమే ఇందుకు కారణం. తాజాగా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కరోనా నుంచి కోలుకున్న 250 మందికిపైగా […]

శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు రాజకీయ నేతలు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ కూడా కరోనా వ్యాధికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన భార్య సినీ నటి రాధిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్టు ఆటు రాధికా శరత్ […]

వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి కరోనా పాజిటివ్ !

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కోవాక్సీన్’ ను హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ నవంబర్ 20న తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లో భాగంగా అనిల్ వ్యాక్సిన్ ను తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన తాజాగా కరోనా బారిన పడటం వ్యాక్సిన్ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తనకు కరోనా వైరస్ సోకిందని ఆయనే ట్వీట్ చేశారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారు టెస్ట్ చేసుకోవాలని సూచించారు. […]

కరోనా : మరో కొత్త ప్రమాదం.. ఊపిరితిత్తులకు యమా డేంజర్

కొవిడ్ వైరస్ వెలుగు చూసి ఏడాది గడిచింది. నెలక్రితం వరకు కాస్త తగ్గుముఖం పట్టినా కేసుల సంఖ్య.. “సెకండ్ వేవ్” విజృంభణతో రికార్డు స్థాయిలో నమోదవుతోంది. గత శనివారం ఒక్కరోజే ప్రపంచం మొత్తం మీద 6 లక్షల 3 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.. పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ సెకండ్ వేవ్ దెబ్బకు వణికిపోతున్నాయి. మానవాళికే సవాల్ విసురుతున్న ఈ వైరస్ నివారణకు పూర్తి స్థాయి వ్యాక్సిన్ సంగతి […]

75 మంది డిగ్రీ విద్యార్ధులకి సోకిన కరోనా

కరోనా కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా కరోనా కాటేస్తుంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంది అని చెప్తున్నా కూడా కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఇక తెలంగాణ లో కూడా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల అయ్యప్పగుట్ట దగ్గరున్న గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ స్టూడెంట్లు సిబ్బంది 75 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి […]

కరోనా పుట్టింది భారత్ లోనే..చైనా సంచలన ఆరోపణ!

కరోనా వైరస్ జోరు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రపంచంలో ప్రతి రోజు కూడా లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. వేలల్లో మరణాలు రికార్డు అవుతున్నాయి. ఇదిలా ఉంటే .. ఈ కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది అని అడిగితే అందరూ చెప్పే ఒకే ఒక మాట చైనా. ఎందుకంటే ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చింది చైనాలోనే ఆ చైనా కంట్రోల్ చేయలేకపోవడం అలాగే మహమ్మారి గురించి సరైన సమాచారాన్ని ఇతర దేశాలకి అందించలేకపోవడంతో వైరస్ వేగంగా ప్రపంచం […]

నాకిది పునర్జన్మ.. అభిమానుల ఆశీస్సులతో బతికా! హీరో రాజశేఖర్

ప్రముఖ హీరో రాజశేఖర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే రాజశేఖర్కు పరిస్థితి చాలా విషమంగా ఉన్నదని వార్తలు వచ్చాయి. పలువురు నటీనటులు కూడా ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారు. రాజశేఖర్ కు చాలా రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించారు. ఆయనకు ఊపిరి అందకపోవడంతో వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందించారు. ఆ సమయంలో రాజశేఖర్ కూతురు శివాత్మిక పెట్టిన ట్వీట్ వైరల్ అయ్యింది. […]

ముప్పావు గంట ఇలా చేస్తే.. కరోనా టెన్షన్ నుంచి రిలీఫ్

కంటికి కనిపించని మహమ్మారి ప్రపంచాన్ని వణికేలా చేయటం తెలిసిందే. దగ్గర దగ్గర ఏడాది కాలంగా ఈ అంశం మానవాళికి మింగుడుపడనిది మారింది. రానున్న మరికొన్ని నెలల పాటు ఇలాంటి పరిస్థితే ఉందంటున్నారు. ఓవైపు కరోనా వ్యాక్సిన్ ప్రయోగం చివరి దశకు వచ్చిందని చెప్పినప్పటికీ.. అది బయటకు వచ్చి.. సగటు జీవి చెంతకు చేరేసరికి చాలానే సమయం పడుతుందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. కరోనా టెన్షన్ ప్రతి ఒక్కరిని వెంటాడి వేధిస్తోంది. ఈ మహమ్మారి పుణ్యమా అని […]

కరోనా వ్యాక్సిన్ పై ప్రధాని నరేంద్రమోడీ కీలక ప్రకటన

ప్రపంచమంతా సెకండ్ వేవ్ కరోనాతో అల్లకల్లోలం అవుతున్న వేళ వ్యాక్సిన్ పరిశోధనలు చివరి దశకు వచ్చాయి. మూడో దశ ట్రయల్స్ పూర్తి చేసిన పలు కంపెనీల వ్యాక్సిన్లు వినియోగానికి రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ పై ప్రధాని నరేంద్రమోడీ కీలక ప్రకటన చేశారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక భేటికి సిద్దమయ్యారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎవరికి వ్యాక్సిన్ పంపిణీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ […]

స్టార్ హీరోయిన్ పాన్ ఇండియా ప్లాన్స్ కి కరోనా చెక్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలకు సంతకాలు చేస్తూ మరోవైపు సొంత ప్రొడక్షన్ లో సినిమాలు నిర్మిస్తూ సదరు స్టార్ హీరోయిన్ వేస్తున్న ప్లాన్స్ ఇటీవల ఇండస్ట్రీలో చర్చకు వచ్చాయి. ఇప్పటికే ఓంరౌత్ ప్లాన్ చేసిన సౌత్ క్రేజీ వెంచర్ ఆదిపురుష్ 3డి కి సదరు బ్యూటీ సంతకం చేసింది. ఏకంగా బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన నటించే ఆఫర్ అందుకుంది. ఇంతకీ ఈ భామ ఎవరో కనిపెట్టేయడం ఈజీనే. ది గ్రేట్ పద్మావత్ ఫేం […]

అరే! ప్రేమ గువ్వల సొంతింటి కలలకు కరోనా చెక్!!

రిచా చాద్దా- అలీ ఫజల్ నెలరోజులుగా సొంతింటి వేటలో ఉన్నారు. ఎట్టకేలకు ఒక కొత్త ఇంటిని కనిపెట్టారు. ఆ కొత్త నివాసంలో కొన్ని సంవత్సరాలపాటు ఉండాలని ప్లాన్ చేశారట. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ జంట వివాహంతో ఒకటి కావాల్సి ఉండగా.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది. రిచా తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొత్త ఇల్లు అద్భుతంగా కుదిరిందని సంతోషం వ్యక్తం చేసింది. ఆ ఏరియా నిశ్శబ్దంగా ఉంది. అందమైన సీ-వ్యూను […]

కరోనా సెకండ్ వేవ్ తో ‘సర్కారు వారి పాట’ కీలక నిర్ణయం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలు అవుతుంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై రాబోతున్న మూడు నెలలు ఒక లెక్క అన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ ప్రారంభం అయినట్లుగా అనిపిస్తుంది. కేసుల సంఖ్య ఒక్కసారిగా డబుల్ త్రిబుల్ అవ్వడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. అమెరికాలో కూడా కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయినట్లుగా అనిపిస్తున్న నేపథ్యంలో మహేష్ […]

జూనియర్ ఆర్టిస్టును బలిగొన్న కరోనా కష్టాలు!

కరోనా ఎఫెక్ట్ సినీపరిశ్రమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. ఈ రంగంమీద ఆధారపడి బతుకుతున్న లక్షలాదిమంది జీవితం దుర్భరంగా మారింది. స్టార్ ప్రొడ్యూసర్లు హీరోలు దర్శకులకు ఏ ఇబ్బంది లేదు. కానీ రోజువారి పనిచేసుకొని కార్మికులు కాలే కడుపుతో కష్టాలు పడుతున్నారు. ఈ రంగం మీద పరోక్షంగా ఆధారపడి బతుకే థియేటర్లలో పనిచేసే కార్మికులు క్యాంటిన్ నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అయితే జూనియర్ ఆర్టిస్టుల జీవితం మరింత దుర్భరంగా మారింది. సినిమా పరిశ్రమ మాంచి ఊపుమీద ఉన్నప్పుడే […]

అన్నయ్య కరోనా బారిన పడటంతో విస్తుపోయాం : పవన్

చిరంజీవి కరోనా బారిన పడటంతో మెగా ఫ్యామిలీ ఆందోళనలో ఉంది. ఎలాంటి లక్షణాలు లేకున్నా కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో త్వరగానే చిరు కోలుకుంటారని అంతా ఆశిస్తున్నారు. చిరంజీవి ఆరోగ్య విషయమై అభిమానులు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ఆరోగ్యం విషయమై ప్రెస్ నోట్ విడుదల చేశారు. అన్నయ్య చిరంజీవి గారు సత్వరమే కోలుకోవాలంటూ కోరుకుంటున్నాను అంటూ పవన్ పేర్కొన్నాడు. పవన్ ప్రెస్ నోట్ […]

కరోనా వ్యాక్సిన్ కు చాలా సమయం పడుతుంది!?

కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. అందరూ ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది జనవరి వరకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే వచ్చే సమ్మర్ వరకైనా దరికి చేరుతుందని భావిస్తున్నారు. కానీ కోవిడ్ వ్యాక్సిన్ కోసం సామాన్య ప్రజలు 2022 వరకు వేచి ఉండాల్సిందేనని ఎయిమ్స్ డైరెక్టర్.. భారతదేశంలో కరోనావైరస్ నిర్వహణపై జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రణదీప్ గులేరియా స్పష్టం చేశారు. కొరోనావైరస్ వ్యాక్సిన్ భారతీయ మార్కెట్లలో సులభంగా లభించడానికి […]

కరోనా పోకేముందే.. మరో మహమ్మారి ఎంట్రీ.. అది కూడా చైనా నుంచే..

కరోనా వ్యాధితో ప్రపంచం మొత్తం తలకిందులైంది. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్నిదేశాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ.. మరికొన్ని దేశాల్లో సెకండ్వేవ్ ముంచుకొస్తున్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇదిలో ఉంటే కరోనా పోకేముందే మరో మహమ్మారి సిద్ధంగా ఉన్నదని డబ్ల్యూహెచ్వో హెచ్చరికలు జారిచేసింది. అది కూడా కరోనా లాగే చైనా లోని ఓ ల్యాబ్లో పుట్టిందని సమాచారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) 73వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ […]

నాలుగు రోజులకు ఒకసారి ఇది 20వ సారి!

బాలీవుడ్ తో పాటు సౌత్ ఆడియన్స్ కు కూడా సుపరిచితం అయిన ముద్దుగుమ్మ ప్రీతి జింటా. ఎప్పుడైతే ఈమె పంజాబ్ జట్టుకు సహ యజమాని అయ్యిందో అప్పటి నుండి ఈమె దేశ వ్యాప్తంగా మరింత పాపులారిటీని దక్కించుకుంది. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఎప్పటికప్పుడు జట్టును వెనుక ఉండి నడిపిస్తుంది. జట్టులో ఒక్క లేడీగా కనిపిస్తూ ఉంటుంది. చుక్కల మద్య చంద్రుడు వెలిగినట్లుగా ప్రీతి జింటా కూడా అంత మంది ప్లేయర్స్ మద్య ఈమె కూడా […]

ప్రముఖ లేడీ యాంకర్ కి కరోనా…!

కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు చాలామంది దీని బారిన పడ్డారు. టాలీవుడ్ లో కూడా అనేకమంది ప్రముఖులకు కరోనా సోకగా.. చికిత్స తీసుకొని బయటపడ్డారు. ఇటీవల కమెడియన్ సుధీర్ కు కూడా కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై సుధీర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో సదరు వార్తలు నిజమేనని అందరూ అనుకుంటున్నారు. ఇదే క్రమంలో […]