డేంజర్: కరోనాతో కొత్త ముప్పు

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా రక్కసి మనకు సోకి పోయినా కూడా దాని పర్యవసనాలు దారుణంగా ఉంటున్నాయని కొత్తగా వెలుగుచూసింది. కరోనా మనుషుల్లో కొత్త సమస్యలను సృష్టిస్తోందని తేలింది. కరోనా సోకి తగ్గిన వారిలో మధుమేహం స్థాయిలు పెరుగుతున్నాయని.. లంగ్ ఇన్ ఫెక్షన్స్ లివర్ కిడ్నీలపై ప్రభావం చూపుతున్నట్లు వైద్యనిపుణులు గుర్తించారు. తాజాగా కరోనాకు గురైన వారిలో కొందరిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడడంతో గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ లకు గురవుతున్నట్టు వెల్లడైంది. ఆస్పత్రుల్లో కరోనా నుంచి కోలుకొని […]

కరోనానే ఈ భారీ వర్షాలకు కారణమట?

వర్షాకాలం ముగిసినా ఇంకా వానలు దంచి కొడుతూనే ఉన్నాయి. గ్రామాలు నగరాలను ముంచేస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే వరదలే వచ్చాయి. ఎందుకు ఇంతలా దంచుతున్నయో అని ప్రజలంతా మధనపడిపోతున్నారు. కుండపోత వానలపై వాతావరణ కేంద్రాలు సైంటిస్టులు ఇప్పుడు శూలశోధన మొదలుపెట్టారు. అంతర్జాతీయ వాతావరణ పరిస్థితులను స్టడీ చేస్తున్నారు. అయితే వీరు ప్రస్తుతం ఓ అంచనాకు వచ్చారు. ‘కరోనా మహమ్మారి’ కారణంగానే ఈ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. కరోనాతో ప్రకృతి అంతా సాఫ్ అయిపోయింది. దీంతో […]

కరోనా అంటించుకుని కాసులు సంపాదిస్తున్న విద్యార్థులు.. యూనివర్శిటీ సీరియస్!

కరోనా వైరస్‌ను అడ్డుపెట్టుకుని ఇప్పటికే మన ప్రైవేట్ హాస్పిటళ్లు ఎంతగా దండుకుంటున్నాయో తెలిసిందే. రూ.100తో వచ్చే మందులను ఏసీ రూముల్లో పెట్టి రోగులకు మింగిస్తూ.. లక్షలు మింగేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నా.. లంచం మరిగిన అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారనేది పబ్లిక్ టాక్. అయితే, ఇప్పుడు కేవలం ప్రైవేట్ హాస్పిటళ్లు మాత్రమే కాదండోయ్. కొంతమంది విద్యార్థులు కూడా దీన్నీ బాగానే క్యాష్ చేసుకుంటున్నారట. ఇందుకు ఏకంగా వారి ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారట. అమెరికాలోని ఇదహోలో గల బ్రిఘం […]

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కు కరోనా

కరోనా కోరలు చాస్తోంది. దేశంలో విశృంఖలంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి నుంచి రాష్ట్రాల మంత్రులు అధికారుల వరకు అందరికీ కరోనా సోకింది. తాజాగా ప్రముఖ హీరో కూడా కరోనా బారినపడ్డారు. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కరోనా బారినపడ్డారు. ఇటీవల జరిపిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈ నటుడు హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఇటీవల ఈ నటుడు జనగణమన అనే మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. అక్కడే వైరస్ […]

ఘోర కరోనా నిన్ను సంహరిస్తానంటూ నృత్య గర్జన చేసి..!!

కరోనాపై పాట పడిన చాలా మంది అదే కరోనాకు బలైన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ నృత్యకారిణి శోభా నాయుడు కరోనా బారిన పడి మృతి చెందారు. ఏప్రిల్ లో కరోనాపై “ధరాతలానికి ముళ్ల కిరీటం కరోనా…“ అంటూ మహమ్మారి కరోనాపై రాసిన పాటకు కూచిపూడి నృత్యాన్ని కంపోజ్ చేసి ఆకట్టుకున్నారు. క్రూర కరోనా… ఘోర కరోనా నిన్ను సంహరిస్తా!! అంటూ అద్భతంగా అభినయించిన శోభా నాయుడు అదే కరోనాకు బలి అయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు […]

కరోనా : కోలుకున్నా.. ప్రతి ఐదుగురిలో ఆ అనారోగ్య సమస్యలు

కసారి కరోనా బారినపడి కోలుకుంటే మరోసారి ఇక ఎటువంటి సమస్యలు ఉండవని చాలామంది భావిస్తున్నారు. ఇష్టారాజ్యంగా బయట తిరిగేస్తున్నారు. మళ్లీ సమస్యలు రావు..అన్నది నిజం కాదని తాజాగా ఒక పరిశోధన తేల్చింది. కరోనా బారినపడి కోలుకున్న వారికీ అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఐదుగురిలో నలుగురికి..సుమారు 80 శాతం మందికి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. కోవిడ్ సోకి ట్రీట్ మెంట్ పూర్తి […]

కరోనా సోకిందనే వార్తలకు చెక్ పెట్టిన మెగా హీరో…!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కరోనా సోకిందంటూ ఈ రోజు ఉదయం నుంచి ఓ న్యూస్ సర్క్యూలేట్ అవుతున్న సంగతి తెలిసిందే. అందుకే ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా డబ్బింగ్ కార్యక్రమం వాయిదా పడిందని.. ప్రస్తుతం తేజ్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే మీడియా సర్కిల్స్ లో ఈ న్యూస్ రావడంతో ఇవన్నీ రూమర్స్ అని నిరూపిస్తూ సాయి ధరమ్ తేజ్ టీమ్ తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది. […]

కరోనాను ఎదుర్కోడానికి అనుష్క చెప్పిన చిట్కాలు…!

దక్షిణాది అగ్ర కథానాయిక అనుష్క – ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘నిశబ్దం’. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ – వివేక్ కూచిభోట్ల మరియు కోన ఫిల్మ్ కార్పొరేషన్ కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. కరోనా కారణంగా థియేట్రికల్ రిలీజ్ ని రద్దు చేసుకుని.. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధం అయింది. […]

కరోనాను ఇలా జయించానంటున్న నాగబాబు

మెగా బ్రదర్ నటుడు నిర్మాత నాగబాబు ఇటీవల కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే.. ఆయన పలు టీవీ షోలను చేస్తున్నారు. ఆ క్రమంలోనే కరోనా బారినపడ్డారని తెలిసింది. కాగా గత 14 రోజులుగా చికిత్స తీసుకుంటున్న నాగబాబు తాను కరోనాను జయించానని తాజాగా తెలిపారు. హోం ఐసోలేషన్ తర్వాత తాను ఎదుర్కొన్న అనుభవాలు తీసుకున్న జాగ్రత్తలు కోలుకున్న విధానాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ఇటీవల తాను ఐదు సార్లు […]

కరోనా మహిమ.. ఆ నటి దొంగగా మారింది!

కరోనా సినిమా వాళ్ళను భలే దెబ్బతీసింది. సినిమాల షూటింగ్ ఆగిపొయి ఎంతోమంది నటీనటులు రోడ్డున పడ్డారు. ఒకప్పుడు బాగా సంపాదన ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు జీవనోపాధి కోసం తోపుడు బండ్లు పెట్టుకుని పండ్లు కూరగాయలు కూడా అమ్ముతున్నారు. ఓ సీరియల్స్ నటి సినిమాలు లేక దొంగగా మారింది. తన ప్రియుడిని రెచ్చగొట్టి దొంగతనం చేయించింది. ఇప్పుడు పోలీసు కేసులో చిక్కుకుంది. దేవత సహా పలు సీరియళ్లల్లో నటించిన సుచిత్ర తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె మణికందన్ […]

73 ఏళ్లకిందటే కరోనాను ఊహించారా? నిజమేనా!

కరోనా మహమ్మారిని మా వీరబ్రహ్మం గారు ముందే ఊహించారు తెలుసా? కాదు చైనా పండితులు ఈ వ్యాధి గురించి ఎప్పుడో చెప్పారు? లేదు లేదు జపాన్ నవలాకారులు కరోనాను ముందే పసిగట్టారు.. అంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అల్బర్ట్ కాము రాసిన ‘ది ప్లేగ్’ నవలలో రాసినట్టే కరోనా మహమ్మారి ముంచుకొస్తున్నదని.. అంతా ఆ నవలలో చెప్పినట్టే జరుగుతున్నదని అల్జీరియా దేవవాసులు భావిస్తున్నారు. దిప్లేగ్ నవలలో ఏముంది అల్జీరియా […]

ఆ మాయదారి మాస్కులు.. కరోనా కారకాలు

మనమంతా కరోనా నుంచి రక్షణ కోసం మాస్కులు ధరిస్తున్నాం.. మన పక్కవాళ్లు కూడా మాస్కులు ధరిస్తే సంతోషిస్తాం. జనసందోహంలో ఉన్నప్పుడు ఆస్పత్రుల్లో ఇతర రద్దీ ప్రదేశాల్లో ఉన్నప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలని డబ్ల్యూహెచ్వో కూడా సూచించింది. కానీ ఇప్పడు ఇప్పుడో కొత్త సమస్య వచ్చి పడింది. కొన్ని రకాల మాస్కులు పెట్టుకున్నవారు మన పక్కన ఉన్నా మనకు ప్రమాదమేనట. అవే వాల్వుతో ఉన్న మాస్కులు. ఈ మాస్కులు పెట్టుకున్నవారు కనుక మన పక్కన ఉంటే మనకు వైరస్ […]

కరోనాకే కాదు.. శివసేనకు పట్టుకున్న కంగనాకు వ్యాక్సిన్ లేదు!

కంగన వర్సెస్ శివసేన ఎపిసోడ్ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ముంబైలో కంగన కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో శివసేన అధినేతలపై ఫైర్ అయిన కంగన తాను ముంబైలో అడుగు పెడుతున్నానని ఏం చేస్కుంటారో చేస్కోమని సవాల్ విసిరింది. చెప్పిందే చేసి చూపించింది. ప్రస్తుతం ఇంటిని కార్యాలయాన్ని కూల్చివేసిన బీఎంసీపై న్యాయ పోరాటానికి కంగన సిద్ధమైంది. ఇక ఈ మొత్తం వ్యవహారంపై ఆర్జీవీ తనదైన శైలిలో పంచ్ లు వేసారు. ఇండియాకు దాపరించిన కరోనాకు.. శివసేనకు పట్టుకున్న […]

ఏపీ సచివాలయం – అసెంబ్లీలో కరోనా కల్లోలం!!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ప్రతీరోజు 10వేల కేసులు చొప్పున బయటపడుతున్నాయి. కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తున్నప్పటికీ సచివాలయం అసెంబ్లీలో ఉద్యోగులు పనిచేస్తూనే ఉన్నారు. తాజాగా నిన్న ఒక్కరోజే ఏపి పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఏకంగా 19 కేసులు బయటపడడం కలకలం రేపింది. దీంతో సచివాలయంలో మొత్తం కేసుల సంఖ్య 138కి చేరింది. దీంతో ఉద్యోగులు సచివాలయానికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక సచివాలయంలో కరోనా ఎఫెక్ట్ తో మంత్రులు ఇటు వైపే రావడం లేదు. చివరికి […]

కరోనా బారిన పడ్డ స్టార్ హీరో

కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. అందరికీ వ్యాపిస్తూనే ఉంది. కరోనా కు కేంద్రంగా మహారాష్ట్ర ఉంది. అందులోనూ ముంబైలో తీవ్రత ఎక్కువగా ఉంది. ముంబైలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోలు అమితాబ్ అభిషేక్ ఐశ్వర్య సహా చాలా మందికి సోకింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ రెజ్లర్ దీపక్ పూనియా కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిద్దరూ వైరస్ లక్షణాలు లేకున్నా.. పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. డాక్టర్ల సలహా మేరకు […]

బాంబు పేల్చేశారు.. గాలి ద్వారా కరోనా.. ఇన్ని మీటర్ల పరిధిలో!

గాలి ద్వారా కరోనా వ్యాపించదని మొదటి నుంచి వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు. తాకడం తుమ్ములు దగ్గు తుంపర్ల ద్వారానే ఈ వ్యాధి వ్యాపిస్తుందన్నారు. అయితే కరోనా పై మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు నిరంతరం అధ్యయనాలు చేస్తున్నారు. అయితే కరోనా విషయంలో ఎవరికీ ఒక స్పష్టమైన అంచనాలు లేవు. దాని పూర్తి లక్షణాలు కూడా ఎవరూ చెప్పలేరు. అధ్యయనం ద్వారా ఏదైనా గుర్తించినప్పుడు కొత్త లక్షణాల గురించి చెబుతున్నారు. వ్యాధి సంక్రమించే విషయమై కూడా అంతే..వైద్య […]

మంత్రి హరీష్ రావుకు కరోనా

తెలంగాణలో వరుసగా ఎమ్మెల్యేలు మంత్రులు కరోనా బారినపడుతున్నారు. తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 30మంది ఎమ్మెల్యేల వరకు కరోనా బారిపడినట్లు సమాచారం. తాజాగా మంత్రులను కూడా కరోనా వదిలిపెట్టడం లేదు. తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా కరోనా బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 7 నుంచి శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు కరోనా పాజిటివ్ […]

రాక్ స్టార్ నూ వదలని కరోనా!

కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఈ వ్యాధి బారినపడి పలు రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఆస్పత్రి పాలవుతున్నారు. తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ది రాక్ డ్వెయిన్ జాన్సన్ కి కరోనా తేలింది. అతడి భార్య లారెన్ కుమార్తెలు జాస్మిన్ టియానాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని రాక్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో విడుదల చేస్తూ ప్రకటించాడు. వరల్డ్ రెజ్లింగ్ పోటీల్లో జాన్సన్ ఎన్నో విజయాలు అందుకుని మోస్ట్ పాపులర్ గా పేరుతెచ్చుకున్నాడు. ఆ […]

అందాల రాక్షసిని మింగేసిన కరోనా రాకాశి

కరోనా మహమ్మారీ మనిషి ఆశల్ని చంపేసింది. ఎందరినో డైలమాలో పెట్టేసింది. టాలీవుడ్ అల్లకల్లోలంగా మారిపోవడంతో ఇక్కడ కెరీర్ ఆశలతో వచ్చిన ఎందరికో అది అశనిపాతమే అయ్యింది. డెబ్యూ హీరోయిన్లు అప్ కమింగ్ స్టార్లు..యువ నాయికలు.. కొత్త నిర్మాతలు.. ట్యాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ ఇలా అందరి ఆశల్ని అడియాశలే చేసింది మహమ్మారీ. పెద్దోళ్లంతా ఓడలు బళ్లయ్యాయి అంటూ కలతలో ఉన్నారు. ఈ పరిస్థితి ఊహించనిది. ఊహాతీతమైన ముప్పులా ఉరుములా మీద పడింది రాకాశి. ఇంక ఇదే కరోనా అందాల […]

పవన్ బర్త్ డేకి.. కరోనా సేవలే కీలక ఎజెండా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్ ఏమిటి? సెప్టెంబర్ 2న బర్త్ డే సందర్భంగా పవన్ అభిమానులు ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు? ఫ్యాన్స్ కి పవన్ ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? అంటూ ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారంతా. ఇంతకీ ఈసారి పవన్ బర్త్ డే స్పెషల్ ఏమిటి? అంటే.. సెప్టెంబర్ 2న పవన్ నుంచి వరుసగా కొత్త సినిమాల ప్రకటన లు ఉంటాయని ఇప్పటికే ప్రచారం సాగి పోతోంది. అయితే ఆరోజు మాత్రం పవన్ ఎంతో […]