Templates by BIGtheme NET
Home >> Cinema News >> బస్తీ బాలరాజ్ భారీ కటౌట్ ముందు హీరో కార్తికేయ పోజ్..!

బస్తీ బాలరాజ్ భారీ కటౌట్ ముందు హీరో కార్తికేయ పోజ్..!


యువ హీరో కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”చావు కబురు చల్లగా” సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. సినిమాపై స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు. నిజానికి విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచి రెగ్యులర్ గా ఏదొక అప్డేట్ ఇస్తూ హడావిడి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ – ట్రైలర్ – సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాకుండా.. సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ థియేటర్స్ వద్ద ఈ సినిమాకు సంబంధించిన భారీ కటౌట్స్ పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

”చావు కబురు చల్లగా” ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న హీరో కార్తికేయ.. తాజాగా హైదరాబాద్ లోని ఓ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ముందు నిలబడి పోజ్ ఇచ్చాడు. ఈ చిత్రంలో తను పోషించిన బస్తీ బాలరాజ్ గెటప్ కు సంబంధించిన ఈ కటౌట్ ముందు నిలబడిన కార్తికేయ.. అదే గెటప్ లో సిమిలర్ పోజ్ ఇచ్చాడు. మొత్తం మీద ఈ చిత్ర బృందం ప్రమోషన్స్ తో మంచి ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. పెగళ్ళపాటి కౌశిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఆమని – అనసూయ – మురళీ శర్మ – శ్రీకాంత్ అయ్యంగర్ – మహేష్ – భద్రం ఇతర పాత్రలు పోషించారు.