Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> Srikaram Subhakaram 5th Jan 2014

Srikaram Subhakaram 5th Jan 2014


Srikaram Subhakaram 5th Jan 2014

రాశి ఫలాలు

Dec 5th  to  11th Jan`2014– by Vakkantam Chandra Mouli, janmakundali.com

మేషం
ఆర్ధికం గా ఈ వారం బలపడతారు
ఆలోచనలను అమలులో పెడతారు
దూరప్రాంతాల నుంచి అందిన లేఖ ద్వారా ముఖ్య సమాచారం తెలుసుకొంటారు
జీవిత భాగస్వామి తో విబేధాలు తొలగుతాయి
స్థిరాస్తి వివాదాలు నెలకొన్న సమర్ధనీయం గా పరిష్కరించుకుంటారు
ఇంటి నిర్మాణ కలసివస్తాయి
పరపతి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు
భాగస్వామ్య వ్యాపారాలు విస్తరణ లో అవరోధాలు తొలగుతాయి
ఉద్యోగావర్గాలకు ఉత్సాహవంతం గా ఉంటుంది
రాజకీయ పదవులు దక్కుతాయి
కళాకారులకు ఉత్సాహవంతం గా ఉంటుంది
మహిళలు కుటుంబం లో ఒడిదుడుకులు అధిగమిస్తారు
మంగళ, బుధవారాల్లో మనశాంతిలోపం. కుటుంబంలో చికాకులు , అనారోగ్య సమస్యలు ఉంటాయి
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
గణపతి ని పూజించడం మంచిది

వృషభం
ఆదాయం మరింతగా పెరుగుతుంది
సన్నిహితుల సహాయం తో ముందడుగు వేస్తారు
ఒక విషయం లో మీరు చేసే చర్చలు సఫలమవుతాయి
ఓర్పు సహనం తో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు
రావలసిన సొమ్ము సైతం అందుతుంది
మీ నైపుణ్యం మిత్రుల ద్వారా వెలుగులోకి వస్తుంది
ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది
ప్రముఖుల తో పరిచయాలు ఏర్పడతాయి
వ్యాపార లావాదేవీలు నూతన పెట్టుబడులతో దిగ్విజయం గా సాగుతాయి
ఉద్యోగస్తులు అప్పగించిన విధులను సమర్దవంతం గా నిర్వహిస్తారు
పారిశ్రామిక, సాంకేతిక వర్గాల వారికి చిక్కులు తొలగి ముందుకు సాగుతారు
మహిళలకు శుభవార్తలు అందుతాయి
కళాకారులకు అనుకోని అవకాశాలు తథ్యం
గురు, శుక్రవారాలలో పనుల్లో తొందరవద్దు, నమ్మిన వ్యక్తులు మోసగించే అవకాశం ఉంది. ఆరోగ్యభంగం అయ్యే అవకాశం ఉంది
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది

మిథునం
ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయమవుతారు
అందరిలోనూ మీ గౌరవం పెరుగుతుంది
చిన్ననాటి మిత్రులను కలసుకొంటారు
మీ ఆశయాలు నెరవేరే అవకాశం ఉంది
నిరుద్యోగులకు శుభవర్తమానాలు అందుతాయి
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది
ప్రయత్నాలు అనుకూలిస్తాయి
బంధువర్గం తో సంతోషం గా గడుపుతారు
వ్యాపారాలలో అనుకొన్న లాభాలు తథ్యం
ఉద్యోగులకు అనుకోని హోదాలు లభిస్తాయి
పారిశ్రామిక, విద్యారంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది
మహిళలకు కుటుంబం లో గౌరవం లభిస్తుంది
సినీ కళాకారులకు సన్మానాలు జరిగే అవకాశం
ఆది, సోమవారాలలో కుటుంబం లో చికాకులు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు వచ్చే అవకాశం
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం
హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది

కర్కాటకం
ఒడిదుడుకులు తొలగి ఊపిరి పీల్చుకొంటారు
పరిస్థితులు మీకు అనుకూలం గా మారుతాయి
మీ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు
వ్యవహారాలు విజయవంతం గా పూర్తి చేస్తారు
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు
చిన్ననాటి మిత్రులను కలసుకొంటారు
ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు
వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతం గా సాగి లాభాలు దక్కుతాయి
ఉద్యోగుల కు ఇంక్రిమెంట్లు రాగలవు
పారిశ్రామిక వర్గాలకు విదేశి పర్యటనలు, పురస్కారాలు అందుతాయి
సినీకళాకారులకు అనుకున్న అవకాశాలు తథ్యం
మహిళలకు ఆరోగ్యం కుదుటపడుతుంది
సోమ, మంగళవారాల్లో ఆకస్మిక ప్రయాణాలు. రుణబాధలు తొలగుతాయి
దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం
ఆదిత్య హృదయం చదవడం మంచిది

సింహం
ఆర్ధిక విషయాలు కొంత నిరాశ కలిగించినా అనుకోని విధం గా బాకీలు వసూలై ఊపిరిపీల్చుకొంటారు
స్నేహితులతో మంచి చెడ్డా చర్చిస్తారు
సంఘం లో పరపతి పెరుగుతుంది
ఆర్గ్యాపారం గా కొద్దిపాటి చికాకులు తప్పవు
బంధువుల నుంచి అనుకూల సమాచారం అందుతుంది
కోర్టు కేసులు పరిశ్కారదసకు చేరుతాయి
ఇంటి నిర్మానయత్నాలు అనుకూలిస్తాయి
శత్రువులు కూడా మిత్రులుగా మారతారు
భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి
ఉద్యోగులు ప్రోమోషన్లు లాభిస్తాయి
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి
సినీ టీవీ కళాకారులకు సన్మాన యోగం
మహిళలకు అనుకోని ఆహ్వానాలు రాగలవు
మంగళ బుధవారాలలో ఒడిదుడుకులు, మానసిక అశాంతి ఉంటుంది
ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం
హనుమాన్ చాలీసా చదవడం మంచిది

కన్య
రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు
ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు తొలగుతాయి
జీవిత భాగస్వామి సలహాల మేరకు నిర్ణయాలు తీసుకొంటారు
భవిష్యత్ పై ఆశలు చిగురిస్తాయి
నిరుద్యోగులకు స్థిర ఉద్యోగయోగం లభిస్తుంది
ఒక ప్రకటన కు ఆకర్షితులవుతారు
రాబడి అనూహ్యం గా పెరుగుతుంది
వ్యాపారాలు లాభిస్తాయి . అలాగే,నూతన పెట్టుబడులకు తగిన సమయం
రాజకీయ వర్గాలకు పదవులు లాభిస్తాయి
సినీకళాకారులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి
మహిళలు నైపుణ్యాన్ని చాటుకుంటారు
గురు, శుక్రవారాలలో అనుకోని ప్రయాణాలు, ఆరోగ్య సమస్యలు, గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం
లక్ష్మీస్తోత్రాలు చదవడం మంచిది

తుల
ఆశ్చర్యకరమైన రీతి లో కార్యక్రమాలు పూర్తి చేస్తారు
అందరిలోనూ గౌరవం పెరుగుతుంది
ప్రణాలికాబద్దంగా ముందుకు సాగి వ్యవహారాలలో విజయం సాదిస్తారు
సంఘం లో గౌరవం దక్కుతుంది
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు
పాతబాకీలు వసూలవుతాయి
స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు
దేవాలయాలు సందర్శిస్తారు
కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకొంటారు
ప్రముఖుల నుంచి పిలుపు రావచ్చు
వ్యాపారాలు ఆశాజనకం గా సాగుతాయి. పెట్టుబడులు, బ్యాంకురుణాలు అందుతాయి
ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి
రాజకీయవర్గాలకు పదవులు వెతుక్కొంటూ రాగలవు
సినీకళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి
మహిళలు కుటుంబ సమస్యలు తీరి ఊరటచెందుతారు
ఆది, మంగళవారాలు వ్యతిరేక ఫలితాలుఉంటాయి. పనుల్లో అవరోధాలు ఎదురవుతాయి.
ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి . వివాదాలు అధికమయ్యి కొంత మనశాంతి లోపిస్తుంది
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ చేయడం మంచిది

వృశ్చికం
అనుకోని విధంగా పనులు పూర్తి చేస్తారు
సమాజసేవాకార్యక్రమాల పై ఆసక్తి చూపుతారు
విలువైన సామాగ్రి ఇంటి కొరకు కొనుగోలు చేస్తారు
మీ మంచితనం తో శత్రువులను సైతం ఆకట్టుకొంటారు
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు
వివాహ, ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి
కుటుంబ సభ్యుల తో కలసి తీర్థయాత్రలు చేస్తారు
వివాదాస్పద నిర్ణయాలను వెనక్కి తీసుకొంటారు
విద్యార్దులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి
వ్యాపార లావాదేవీలు విస్తరిస్తారు
ఉద్యోగులకు ఊహించని హోదాలు ఖాయం
పారిశ్రామిక వేత్తలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి
కళాకారులకు నూతనోత్సాహం
మహిళలకు అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచి ఫలితాలనిస్తుంది

ధనుస్సు
ఆర్ధికం గా కొంత ఇబ్బందులు ఎదురైనా ఏదో విధం గా అవసరాలు తీరుతాయి
భవిష్యత్తు పై కొత్త ఆశలు చిగురిస్తాయి
సంగీత, సాహిత్య రంగాల పై ఆసక్తి చూపుతారు
వివాహయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు
గృహ నిర్మాణ ప్రయత్నాలు మొదలు పెడతారు
చాకచక్యం, సహనం తో ముందుకు సాగి విజయాలు సాదిస్తారు
వ్యవహారాలలో ఆటంకాలు అధిగమిస్తారు
ఆలయాలు సందర్శిస్తారు
వ్యాపారులు అనుకున్న లాభాల కోసం శ్రమిస్తారు
ఉద్యోగావర్గాలకు ఆకస్మిక మార్పులు కొంత నిరాశ కలిగిస్తాయి
పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు
కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకొంటారు
మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది
బుధ, గురువారాల్లో భార్యాభర్తల మధ్య కలహాలు వస్తాయి. ప్రయాణాల లో అవరోధాలు కలుగుతాయి.
ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం
ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలనిస్తుంది

మకరం
ఆర్ధిక వ్యవహారాలు అనుకూలించక రుణాలు చేస్తారు
రావలసిన సొమ్ము సైతం అందదు
వివాదాలు చుట్టిముట్టి చికాకు పరుస్తాయి
ఆలోచనాలు స్థిరం గా ఉండవు
ఇంటాబయటా వ్యతిరేకత పెరుగుతుంది
వాహనాల విషయం లో అప్రమత్తత పాటించడం మంచిది
భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు మధ్య లో విరమిస్తారు
కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు
శ్రమ మీది ఫలితం వెరొకరిదిగా ఉంటుంది
వ్యాపారాలలో గందరగోళం పరిస్థితులు నెలకొంటాయి
ఉద్యోగులు విధుల్లో మరింత బాధ్యతాయుతం గా మెలగాలి
పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి
సినికళాకారులకు అంచనాలు తప్పుతాయి
మహిళలకు ఇంటాబయటా చికాకులు తప్పవు
మంగళ, బుధవారాలు మాత్రం శుభవార్తలు వింటారు.
అనుకోని ధనలాభం చేకూరుతుంది
తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతం గా పూర్తి చేస్తారు
భార్యాభర్తలు, సోదరీ, సోదరులతో విబేదాలు తొలగుతాయి
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
దత్తాత్రేయస్వామి ని పూజించడం మంచిది

కుంభం
వ్యవహారాలలో విజయం సాదిస్తారు
అపురూపమైన సామాగ్రి, వాహనాలు కొనుగోలు చేస్తారు
రాబడి అనుకున్న విధం గా పెరుగుతుంది
దీర్ఘకాలిక రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది
అలాగే, కోర్టు వ్యవహారాలు అనుకూలమవుతాయి
ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి
సమాజ సేవలో నిమగ్నమవుతారు
మీ ప్రతిభాపాతవాలకు గుర్తింపు లభిస్తుంది
దూరప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి
వ్యాపారులకు అనుకోని లాభాలు
ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి
రాజకీయ, వైద్య రంగాల వారికి పట్టిందల్లా బంగారమే
కళాకారులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి
మహిళలకు ఆస్తి లాభం
శనివారం ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. భార్య భర్తల మధ్య విభేదాలు. అనారోగ్య సూచనలు కూడా కలవు
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది

మీనం
ఆదాయం సంతృప్తినిస్తుంది. కొన్ని రుణాలు సైతం తీరుస్తారు
ఆత్మీయులు దగ్గరవుతారు
మీ అనుభవాలను మిత్రులతో పంచుకొంటారు
సేవలకు తగిన గుర్తింపు రాగలదు
వివాదాల నుంచి బయటపడతారు
భాధ్యతలు సమర్దవంతం గా నిర్వహిస్తారు
కార్యక్రమాలు సజావుగా సాగుతాయి
వాహన సౌఖ్యం లభిస్తుంది
అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు
వ్యాపారాలు విస్తరిస్తారు
ఉద్యోగులకు ఉన్నత స్థితి తథ్యం
పారిశ్రామికవేత్తలు ప్రభుత్వకార్యక్రమాలలో పాలుపంచుకొంటారు
సినీ కళాకారులకు అవార్డులు లభిస్తాయి
మహిళలు కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు
ఆది, సోమవారాల్లో పనుల్లో అవాంతరాలు. వృధా ఖర్చులు. సోదరీ, సోదరులు మరియు భార్య భర్తల మధ్య స్వల్ప అపార్ధాలు తలెత్తవచ్చు. చొర భయం ఉంటుంది
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం
ఆంజనేయ స్వామి ని పూజించడం మంచిది

Tags : Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Srikaram Subhakaram 5th Jan 2014