Templates by BIGtheme NET
Home >> Cinema News >> టాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోతోంది రాజా…!

టాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోతోంది రాజా…!


ఇటీవల కాలంలో టాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోతోందనే మాట ఎక్కువగా వింటూ ఉన్నాం. అయితే దీనికి టెక్నాలజీతో పాటు చిత్ర రంగంలో వచ్చిన మార్పులు కూడా కారణమని చెప్పవచ్చు. డిజిటల్ వరల్డ్ లో ఓటీటీల హవా ప్రారంభం అయ్యాక మేకర్స్ అందరూ దానికి తగ్గట్టే వెబ్ కంటెంట్ ని డెవలప్ చేస్తున్నారు. అందులోనూ ఇంతకు ముందు అస్లీల కంటెంట్ కి అభ్యంతకర చిత్రాలకు సెన్సార్ బోర్డ్ అడ్డుకట్ట వేసేది. దీంతో ‘ఏ’ సర్టిఫికేట్ సినిమా అయినా సరే పరిధి మేరకే అడల్ట్ కంటెంట్ చూపించేవారు. అయితే ఇప్పుడు ఓటీటీ కంటెంట్ కి సెన్సార్ లేకపోవడంతో రెచ్చిపోయి బోల్డ్ కంటెంట్ చూపించేస్తున్నారు. హాలీవుడ్ – బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ మన టాలీవుడ్ లో మాత్రం ఈ మధ్య అడల్ట్ కంటెంట్ ఎక్కువ అయిందని చెప్పవచ్చు. గత ఐదు నెలలుగా థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఇలాంటి కంటెంట్ కి ఎక్కువగా ఆదరణ దక్కుతోందనేది కూడా అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. ఇటీవల ప్రముఖ ఓటీటీల్లో టాప్ హిట్స్ అందుకున్న ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్ లు అన్ని అడల్ట్ కంటెంట్ తో రూపొందించినవే. ముఖ్యంగా నేటితరం యూత్ వీటికి బాగా ఆకర్షితులు అవుతున్నారు. ఓటీటీలో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ని జనాలు చూస్తున్నారు కాబట్టి ఈ నిర్మాణ సంస్థలు కూడా అడల్ట్ కంటెంట్ ఉన్న కథలు సినిమాలుగా.. వెబ్ సిరీస్ లుగా తీయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అంతేకాకుండా ముందుగా అనుకున్న స్టోరీలో అడల్ట్ కంటెంట్ ని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంతకుమించిన కంటెంట్ ప్రసారం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి అలాంటి కంటెంట్ చూపిస్తున్నాం అని చెప్తున్నా ఓటీటీలు వచ్చి మన తెలుగు సినిమా పరువుకి ఎసరు పెట్టిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఫ్యూచర్ లో ఓటీటీ కంటెంట్ ని కూడా సెన్సార్ పరిధిలోకి తీసుకొచ్చి అడల్ట్ కంటెంట్ కి బ్రేక్స్ వేస్తారేమో చూడాలి.