Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘సలార్’ అంటే ఏంటో చెప్పిన ప్రశాంత్ నీల్..!

‘సలార్’ అంటే ఏంటో చెప్పిన ప్రశాంత్ నీల్..!


పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ – ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్న ప్రశాంత్ నీల్.. సడన్ గా ప్రభాస్ తో సినిమా ప్రకటించి అందర్నీ ఆశ్యర్యానికి గురి చేశారు. ‘సలార్’ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ప్రభాస్ వైలెంట్ లుక్ ని చూసిన సినీ అభిమానులు షాక్ తిన్నారు. అలానే అందరూ ‘సలార్’ అంటే అర్థం ఏమిటని గూగుల్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ‘సలార్’ టైటిల్ మీనింగ్ మరియు ప్రభాస్ తో సినిమా చేయడానికి గల కారణాలను వెల్లడించాడు.

ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. “కన్నడ హీరోలతో కాకుండా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రభాస్ తో సినిమా చేయడం గురించి అందరూ అడుగుతున్నారు. నేను రాసుకున్న ‘సలార్’ కథకు ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని నాకు అనిపించింది. అందుకే ఆయనతో ఈ సినిమా చేస్తున్నా. ఇందులో ప్రభాస్ క్యారక్టర్ వైలంటుగా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. ”సలార్ టైటిల్ కు ఎన్నో రకాల అర్థాలు చెబుతున్నారు. అది ఉర్దూ భాషలోని ఒక సామాన్యమైన పదం. ‘సలార్’ అంటే సమర్థవంతమైన నాయకుడు.. రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్రజలను రక్షించే వ్యక్తి అని చెప్పొచ్చు. ఓ వైలెంట్ పాత్రను మీ ముందుకు తీసుకురానున్నాను. దీనికి తగ్గట్టే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాం. ప్రభాస్ లుక్ చూసి ఆర్మీలో ఉండే వ్యక్తి అని అందరూ అనుకుంటారనే ఫస్ట్ లుక్ పోస్టర్ ను టైటిల్ తో పాటు విడుదల చేశాం” అని ప్రశాంత్ నీల్ ఈ సందర్భంగా వెల్లడించారు.