Templates by BIGtheme NET
Home >> GADGETS >> Realme యూజర్లకు ఎగిరి గంతేసే న్యూస్.. వేరే బ్రాండ్ యూజర్లయితే ఈ వార్త విన్నాక బాధ పడకండి!

Realme యూజర్లకు ఎగిరి గంతేసే న్యూస్.. వేరే బ్రాండ్ యూజర్లయితే ఈ వార్త విన్నాక బాధ పడకండి!


Realme యూజర్లకు ఎగిరి గంతేసే న్యూస్.. వేరే బ్రాండ్ యూజర్లయితే ఈ వార్త విన్నాక బ…

రియల్ మీ సీఈవో మాధవ్ సేథ్ ఎప్పుడూ ట్వీటర్లో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలో ఆయన ఈ మధ్య ట్వీటర్ యూజర్లతో మాటా మంతీ జరిపారు. ఈ సందర్భంగా కొన్ని రియల్ మీ ఫోన్లకు రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్లు, సెక్యూరిటీ ప్యాచ్ లను కూడా అందిస్తామని తెలిపారు. అయితే ఏయే ఫోన్లకు ఈ అప్ డేట్లకు అందిస్తామో చెప్పలేదు. తాజాగా రియల్ మీ ఇండియా సీఎంవో ఫ్రాన్సిస్ వాంగ్ ఆండ్రాయిడ్ 11 అప్ డేట్ అందుకునే రియల్ మీ ఫోన్ల జాబితాను తెలిపారు.

ఆయన చెప్పిన దాని ప్రకారం రియల్ మీ ఎక్స్2 ప్రో, రియల్ మీ ఎక్స్2, రియల్ మీ ఎక్స్ టీ, రియల్ మీ ఎక్స్, రియల్ మీ 3 ప్రో, రియల్ మీ 5 ప్రో స్మార్ట్ ఫోన్లు ఈ ఆండ్రాయిడ్ 11 అప్ డేట్ ను అందుకోనున్నాయి. ట్వీటర్లో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు వాంగ్ సమాధానమిస్తూ రియల్ మీ ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లకు ఆండ్రాయిడ్ 11 అప్ డేట్ రానుందని తెలిపారు. ఈ సిరీస్ లో కేవలం నాలుగు ఫోన్లు మాత్రమే ఉన్నాయి. అవే రియల్ మీ ఎక్స్2 ప్రో, రియల్ మీ ఎక్స్2, రియల్ మీ ఎక్స్ టీ, రియల్ మీ ఎక్స్ స్మార్ట్ ఫోన్లు. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఇప్పుడప్పుడే కొత్త ఫోన్ కొనే అవసరం లేదు.

అయితే వెంటనే మరో ట్వీటర్ యూజర్ ఎక్స్-సిరీస్ ఫోన్లకు తప్ప మరే ఫోన్లకు ఈ అప్ డేట్ వస్తుందని అడిగాడు. దానికి సమాధానంగా ప్రో సిరీస్ ఫోన్లకు కూడా ఈ అప్ డేట్ ఇస్తామని తెలిపారు. రియల్ మీ 2 ప్రో స్మార్ట్ ఫోన్లకు ఇప్పటికే రెండు మేజర్ అప్ డేట్లు వచ్చేశాయి. ఈ జాబితాలో ఇంక మిగిలినవి కేవలం రియల్ మీ 3 ప్రో, రియల్ మీ 5 ప్రో మాత్రమే. ఇప్పుడు వాటికి కూడా ఈ అప్ డేట్ ను ఇస్తున్నట్లు అధికారిక సమాచారం వచ్చినట్లే.

రియల్ మీ ఎక్స్-సిరీస్ స్మార్ట్ ఫోన్లలో ఎక్స్ టీ స్మార్ట్ ఫోన్ కు ఇప్పటికే ఆండ్రాయిడ్ 10 అప్ డేట్ రావడం ప్రారంభం అయింది. రియల్ మీ ఎక్స్ స్మార్ట్ ఫోన్ కు ఈ అప్ డేట్ వచ్చే నెలలో వస్తుంది. రియల్ మీ ఎక్స్2, ఎక్స్2 ప్రో స్మార్ట్ ఫోన్లకు మార్చిలో ఈ అప్ డేట్ వస్తుంది. వీటితో పాటు ఆండ్రాయిడ్ 11 అప్ డేట్ కూడా వీటికి రానుంది.

ప్రో-సిరీస్ ఫోన్లలో రియల్ మీ 3 ప్రో స్మార్ట్ ఫోన్ కు ఇప్పటికే ఆండ్రాయిడ్ 10 అప్ డేట్ వచ్చేసింది. 5 ప్రో ఫిబ్రవరిలో ఈ అప్ డేట్ ను అందుకోనుంది. రియల్ మీ 3, 3ఐ స్మార్ట్ ఫోన్లు ఏప్రిల్ లో, రియల్ మీ 5, 5ఎస్ స్మార్ట్ ఫోన్లకు ఈ అప్ డేట్ మేలో రానుంది. రియల్ మీ 2 ప్రోకు జూన్ లో, రియల్ మీ సీ2కు సెప్టెంబర్ లోపు ఈ అప్ డేట్ రానుంది.