నిమ్మగడ్డ కేసు: ఏపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు

0

గవర్నర్ కు రాసిన లేఖల లీకేజీ వ్యవహారంలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారంకు వాయిదా వేసింది.

గవర్నర్తో తాను జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ బయటకు లీకవుతుండటంపై విచారణ జరపాలని నిమ్మగడ్డ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని.. తాను గవర్నర్కు రాస్తున్న ప్రివిలేజ్ లెటర్స్ అన్నీ ఆఫీస్ నుంచి ఎలా బయటకు వస్తున్నాయో తేల్చాలని నిమ్మగడ్డ పిటీషన్ లో కోరారు.

తాను గవర్నర్కు రాసిన లేఖల్ని సోషల్ మీడియాలో చూశామని మంత్రులు చెబుతున్నారని.. వారికి ఎలా తెలుస్తున్నాయని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఈ విషయం బయటకు ఎలా వచ్చిందో విచారణ జరపాలని నిమ్మగడ్డ కోరారు.ఈ క్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎస్ మంత్రులు పెద్దిరెడ్డి బొత్సలను ప్రతివాదులుగా చేర్చారు. ఇందులో భాగంగా జరిగిన విచారణలోనే ఇద్దరు మంత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.