రాహుల్ గాంధీ సంచలన ప్రకటన

0

దేశంలో పన్నుల సంస్కరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ పారదర్శక పెంచినా ప్రజలు వ్యాపారుల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక కొందరు జీఎస్టీ పేరుతో దందాలు మొదలుపెట్టారన్న ఉదంతాలు బయటపడ్డాయి.

అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీఎస్టీని మార్చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. తమిళనాడు పర్యటనలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ప్రతినిధులతో సమావేశమైన రాహుల్ గాంధీ.. జీఎస్టీ వల్ల ఈ పరిశ్రమలపై అధిక భారం పడిందన్నారు.

వ్యాపారవేత్తల కోసమే జీఎస్టీని తెచ్చారని.. ఎంఎస్ఎంఈల కోసం కాదని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. జీఎస్టీ గురించి బీజేపీ ప్రభుత్వానికి తెలియదని వ్యాఖ్యానించారు.

ఇక బీజేపీ పాలనలో పెరిగిపోతున్న పెట్రో ధరలపై కూడా రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే పెట్రోల్ ధరలు తగ్గుతాయని హామీ ఇచ్చారు. పెట్రో ధరలతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న బీజేపీ సర్కార్ ను ఓడించాలని రాహుల్ పిలుపునిచ్చారు.