Templates by BIGtheme NET
Home >> Telugu News >> అమెరికా తర్వాత ఆ దరిద్రపు రికార్డు మనదే

అమెరికా తర్వాత ఆ దరిద్రపు రికార్డు మనదే


ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ 19 మహమ్మారి.. దేశాన్ని.. దేశ ఆర్థిక పరిస్థితిని ఎంతలా ప్రభావితం చేసిందో తెలిసిందే. ఆ మాటకు వస్తే.. మహా.. మహా అనుకున్న వాళ్లే ఉక్కిరిబిక్కిరి అయిపోయిన పరిస్థితి. సంపన్న దేశాలు సైతం.. కరోనా సంక్షోభాన్ని తట్టుకునే విషయంలో చేతులు ఎత్తేసిన పరిస్థితి. నిజానికి కోవిడ్ చేసిన ఆరాచకం ఒక ఎత్తు అయితే.. ప్రపంచానికి అనుకోని రీతిలో విరుచుకుపడే ఒక సవాల్ ను ఎదుర్కోనే సత్తా కోవిడ్ రూపంలో ప్రపంచానికి అందిందని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. మహమ్మారికి సంబంధించిన ప్రపంచంలో అత్యధిక ప్రభావం అమెరికా మీదనే. ఆ దేశంలో నమోదైనన్ని కేసులు.. మరణాలు మరే దేశంలోనూ చోటు చేసుకోలేదు. అత్యధిక మరణాలుచోటు చేసుకున్న దేశంగా అగ్రరాజ్యం నిలిచింది. కేసులు కూడా భారీగానే నమోదయ్యాయి. తాజాగా భారత దేశానికి ఒక చెత్త రికార్డు సొంతమైంది. కరోనా విషయంలో అమెరికా తర్వాత ఎక్కువగా నమోదైన కేసులున్న దేశంగా భారత్ చేరింది.

అమెరికాలో ఇప్పటికే కోటికి పైగా పాజిటివ్ కేసులు నమోదైతే.. తాజాగా కోటి మార్కును భారత్ కూడా దాటేసింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 25152 కేసులు నమోదైతే.. ఇప్పటివరకు పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య కోటిని దాటేసింది. 95.5 లక్షల మంది ఇప్పటికే కోలుకొని ఇంటికి చేరుకోగా.. 1.45లక్షల మంది కన్నుమూశారు. తాజాగా నమోదైన కోటి కేసుల్లో దేశంలోని పది రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదయ్యాయని చెప్పాలి.

అంతేకాదు.. మొత్తం కేసుల్లో 75 శాతం పది రాష్ట్రాలకు చెందిన వారేకాదు.. మరణాల్లోనూ ఆ రాష్ట్రాల్లోనే 78 శాతం చోటు చేసుకోవటం గమనార్హం. మార్చి 25న విధించిన లాక్ డౌన్ కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసిందనే చెప్పాలి. అయితే.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో తీవ్రంగా మారగా.. నవంబరు నుంచి కేసుల నమోదు గణనీయంగా తగ్గాయని చెప్పక తప్పదు. దీంతో.. ప్రజలు కాస్త పీల్చుకునే వీలు కలిగిందని చెప్పాలి.