Templates by BIGtheme NET
Home >> Cinema News >> రావి చెట్టును అల్లుకున్న జాజి మల్లె తీగలా..

రావి చెట్టును అల్లుకున్న జాజి మల్లె తీగలా..


విజయ్ దేవరకొండ సరసన లైగర్ చిత్రంలో నటిస్తోంది అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ టాలీవుడ్ లోనూ వేవ్స్ ని ప్రసరిస్తోంది. ఇప్పటికే రౌడీ ఫ్యాన్స్ అనన్య అందచందాలకు ఫిదా అయిపోయారు.

రౌడీ ఫ్యాన్స్ కి నిరంతరం ఇన్ స్టాలో టచ్ లో ఉంటోంది. అక్కడ వరుస ఫోటోల్ని షేర్ చేస్తోంది. అవన్నీ అంతర్జాలంలో క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఇంతకుముందే బార్బీ బొమ్మను తలపిస్తున్న ఓ స్పెషల్ ఫోటోషూట్ ని షేర్ చేయగా అది అంతర్జాలాన్ని షేక్ చేసింది.

తాజాగా వైట్ టూపీస్ టాప్.. కాంబినేషన్ బ్లాక్ జీన్స్ తో అనన్య అదిరిపోయే ఫోజిచ్చింది. ఈ ఫోటో చూడగానే బోయ్స్ అనన్య కిల్లింగ్ అంటూ వ్యాఖ్యల్ని జోడిస్తూ వైరల్ చేస్తున్నారు. లైగర్ పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ కానుండడంతో సౌత్ అంతటా ఈ భామ పాపులరైపోతోంది. ఇక ఇన్ స్టా వేదికగా నేటితరంలో అద్భుత ఫాలోయింగ్ ని తెచ్చుకుంటోందని చెప్పాలి.