Templates by BIGtheme NET
Home >> Cinema News >> నాని నుంచి మరో కామెడీ ట్రీట్ పక్కా!

నాని నుంచి మరో కామెడీ ట్రీట్ పక్కా!


నాని వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ ‘వీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమా చేస్తున్న నాని మరో సినిమాకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ‘బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే మరో సినిమాలో నటించేందుకు నాని అంగీకారం తెలిపారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమాకు సంబంధించిన థీమ్ పోస్టర్ ఇటీవల విడుదల చేయగా.. అందులో నాని పంచెకట్టుతో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో నాని బ్రాహ్మణ యువకుడి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నాని తన ఇంటిని అద్దెకు ఇవ్వాలని అనుకోగా హీరోయిన్ నజ్రియా ఆమె కుటుంబ సభ్యులు బ్రాహ్మణులుగా నటిస్తూ నాని ఇంట్లోకి ప్రవేశిస్తారని ఆ తర్వాత హీరో హీరోయిన్ల మధ్య కథ నడుస్తుందని తెలుస్తోంది. మరి అబద్ధం చెప్పి ఇంట్లోకి చేరిన హీరోయిన్ కుటుంబ సభ్యులు నానికి మధ్య కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఎటువంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నాని కామెడీ యాంగిల్ లో మరింత రెచ్చిపోతాడు. భలే భలే బలే మగాడివోయ్ సినిమా అంత సక్సెస్ సాధించిందంటే అందులో నాని కామెడీ టైమింగ్ అదిరిపోవడం ఓ కారణమే.’ అంటే సుందరానికి ‘ సినిమాలో కూడా మరోసారి తన కామెడీ యాంగిల్ తో అభిమానుల్ని అలరించడానికి నాని సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే బ్రాహ్మణ యువకుడి పాత్రలో ఎన్టీఆర్ఇప్పటికే బ్రాహ్మణ యువకుడి పాత్రలో ఎన్టీఆర్ అల్లు అర్జున్ అదిరిపోయే యాక్టింగ్ చేయగా మరి నాని ఎలా మెప్పిస్తాడో చూడాలి.