ఈ సమ్మర్ లో మలైకాకు పెళ్లి బాజా?

0

బాలీవుడ్ హాట్ పెయిర్ అర్జున్ కపూర్ – మలైకా అరోరా పెళ్లెప్పుడు? అభిమానులను వేధిస్తున్న సమాధానం లేని ప్రశ్న ఇది. ఆ ఇద్దరూ ఎవరికి వారే యమునా తీరే అంటూ సరైన ఆన్సర్ ఇవ్వరు. మీడియా ఇంటర్వ్యూల్లో ఇదే ప్రశ్న రిపీటవుతున్నా సమాధానమే లేదు. ఇప్పుడిలా సంతోషంగా ఉన్నాం. పెళ్లి ఊసు ఇప్పట్లో లేదు అనేస్తుంటారు.

మొన్ననే నూతన సంవత్సర వేడుకలకు గోవా బీచ్ పరిసరాల్లోని అమృత అరోరా 5బీహెచ్ ఇంటికి వెళ్లింది ఈ జంట. అక్కడ పూల్ సైడ్ రొమాన్స్ గురించి.. యోగా ట్రీట్ గురించి తెలిసినదే. నిరంతరం జంటగా చిలౌట్ చేస్తున్న ఫోటోల్ని ఆ ఇద్దరూ షేర్ చేస్తూ తమ మధ్య ఘాడమైన ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. ఈ జంటకు ఇలాంటి విహార యాత్రలు ఇప్పుడే కొత్తేమీ కాదు. సందర్భం ఏదైనా కానీ.. జంటగా ఒంటరి దీవుల సెలబ్రేషన్స్ కి వెళ్లిపోతుంటారు.

తాజా సమాచారం ప్రకారం..ఈ జంట పెళ్లి బాజాకు టైమ్ వచ్చేసిందని తెలిసింది. అర్జున్ – మలైకా ఇద్దరూ ఏప్రిల్ నెలలో పెళ్లి తేదీని ఫిక్స్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. అధికారికంగా దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మలైకా అరోరా తన మొదటి భర్త అర్బాజ్ ఖాన్ నుండి 2017 లో విడిపోయిన విషయం తెలిసిందే. అప్పటినుండి అర్జున్ కపూర్ తో ప్రేమాయణం విషయంలో ఎలాంటి దాపరికం లేకుండా బహిరంగంగానే ఉంటోంది. ఈ జంట పెళ్లికి మలైకా టీనేజీ వారసుడు అర్హన్ ఖాన్ అంగీకరించారని ఇంతకుముందు గుసగుసలు వినిపించాయి.