Templates by BIGtheme NET
Home >> Cinema News >> రజినీ నిర్ణయంపై భారతీరాజా కీలక వ్యాఖ్యలు

రజినీ నిర్ణయంపై భారతీరాజా కీలక వ్యాఖ్యలు


తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావట్లేదు అన్న ప్రకటన అక్కడి సినీ రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. దీనిపై మిత్రుడు కమల్ హాసన్ సహా చాలా మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా కూడా స్పందించాడు. రజినీకాంత్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నాడు. రజినీకాంత్ రాజకీయ ఊబిలోకి దిగకపోవడమే మంచిదైందని సూచించారు. సినిమా నటులకు భాష ప్రాంతాలతో సంబంధం లేదని.. కానీ రాజకీయాలకు ప్రాంతీయత తప్పకుండా కావాలని పేర్కొన్నాడు. అందుకే నేను రజినీకాంత్ తో విభేదించానని భారతీరాజా పేర్కొన్నారు.

తమిళనాడులో తమిళులే సీఎంగా ఉండాలన్న భారతీరాజా.. రజినీకాంత్ రాజకీయాలకు రాకపోవడం అతడి ఆరోగ్యరీత్యా మంచిదని సూచించారు. ఆయన అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

రజినీకాంత్ సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు ఇంకెవరూ సంపాదించలేదని భారతీరాజా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన భావిజీవితం ప్రశాంతంగా గడవాలని కోరుకున్నాడు.

కుటుంబ సభ్యుల సలహా మేరకు రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించినట్టు ఇటీవల రజినీకాంత్ ప్రకటించి అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తనను క్షమించాలంటూ మూడు పేజీల లేఖ కూడా రజినీకాంత్ విడుదల చేసారు. దీనిపైనే ఇప్పుడు తమిళనాట చర్చ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.