క్రిష్ ఆలోచన నిజంగా అభినందనీయం

0

కరోనా మహమ్మారి అనేది వచ్చి ఉండకుంటే పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ వచ్చి ఉండేది అలాగే క్రిష్ దర్శకత్వంలో సినిమా సగానికి పైగా పూర్తి అయ్యి ఉండేది. కాని కరోనా కారణంగా మొత్తం ప్లాన్ నాశనం అయ్యింది. కరోనా వల్ల కొన్ని వందల సినిమాలు రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. చాలా సమయం వృదా అవుతుంది. దర్శకుడు క్రిష్ మాత్రం ఈ సమయంను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. లాక్ డౌన్ టైమ్ లో స్క్రిప్ట్ వర్క్ చేపట్టిన క్రిష్ ఆ తర్వాత వెబ్ సిరీస్ ల నిర్మాణంపై దృష్టి పెట్టాడు.

తాజాగా ఒక సినిమాను కూడా క్రిష్ మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ తో సినిమా కమిట్ అయ్యాక మరో హీరోతో సినిమాను చేసేందుకు ఖచ్చితంగా ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఆ సినిమా ఫలితం తారు మారు అయితే పవన్ మూవీపై ప్రభావం పడే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతారు. కాని క్రిష్ తీసుకున్న నిర్ణయం మెగా ఫ్యాన్స్ నోరు మెదపకుండా ఉంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఆయన సినిమాను చేసేందుకు కమిట్ అవ్వడం వల్ల మెగా ఫ్యాన్స్ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం లేదు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కు సిద్దంగా లేడు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాతే సినిమా షూటింగ్ కు వెళ్లాలని పవన్ భావిస్తున్నాడు. వకీల్ సాబ్ చిత్రం పూర్తి అయితే కాని క్రిష్ కు పవన్ డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కనుక చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే వైష్ణవ్ తేజ్ తో ఈ గ్యాప్ లో సినిమా తీయాలని టైం వేస్ట్ చేయకుండా క్రిష్ తీసుకున్న నిర్ణయంను చాలా మంది అభినందిస్తున్నారు. స్టార్ హీరో సినిమా కోసం ఏళ్లు ఎదురు చూసిన దర్శకులు క్రిష్ ను చూసి నేర్చుకుంటే బాగుంటుందేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.