శంకర్ వర్సెస్ లైకా! ఇంకా గొడవ సద్దుమణగలేదా?

0

దిగ్రేట్ డైరెక్టర్ శంకర్ ఎన్నో అవాంతరాల తరువాత `ఇండియన్ 2` చిత్రాన్ని పట్టాలెక్కించిన సంగతి విధితమే. 2.0 రిజల్ట్ పెద్ద దెబ్బ కొట్టడంతో తదుపరి చిత్రంపై ఆ ప్రభావం తీవ్రంగా పడిందని కథనాలొచ్చాయి. కమల్హాసన్ హీరోగా `ఇండియన్` చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ 220 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రారంభించింది. అయితే బడ్జెట్ కారణంగా కొంత కాలం ఈ మూవీని చర్చల దశలోనే మేకర్స్ పక్కన పెడుతూ వచ్చారు. ఫైనల్ గా శంకర్ కొంత తగ్గడం తో ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్ ని పట్టాలెక్కించి మెజారిటీ షెడ్యూల్ ని పూర్తి చేశారు.

అంతలోనే క్రేన్ యాక్సిడెంట్ జరిగి యూనిట్ మెంబర్స్ చనిపోవడంతో ఈ మూవీ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా షాక్ కు గురైన శంకర్… కమల్హాసన్ లైకా పై విరుచుకు పడ్డారు. సరైన రక్షణలు కల్పించక పోవడం వల్లే ప్రమాదం జరిగిందని కమల్ దుయ్యబట్టారు. వీరి మధ్య వివాదం సినిమా ఆగిపోయే దాకా వెళ్లింది. ఆ తరువాత కమల్ కలగజేసుకోవడం తో మళ్లీ మొదలు పెట్టాలనుకున్నారు.

ఊహించని ఉత్పాతాలకు అదనంగా ఇంత లో కరోనా వైరస్ వచ్చిపడింది. దీంతో గత ఏడెనిమిది నెలలుగా `ఇండియన్ 2` షూట్ పునః ప్రారంభంపై ఎలాంటి అప్ డేట్ లేదు. ఎవరికి వారు గప్ చుప్ గా ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ బడ్జెట్ ని మరింత తగ్గించాలని లైకా భావిస్తోందట. శంకర్ మాత్రం ఆ విషయంలో రాజీపడేదిలేదని చెప్పినట్టు తెలుస్తోంది. సినిమా ఎప్పుడు మళ్లీ మొదలుపెడతారన్నది శంకర్ కి లైకా వర్గాలు చెప్పడం లేదని కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ విషయంలో క్లారిటీ కోసం శంకర్ ఎదురుచూస్తున్నారని… లేట్ అయ్యే అవకాశం వుంటే ఆ ప్లేస్ లో మరో చిత్రాన్ని మొదలుపెట్టాలని శంకర్ భావిస్తున్నారని ప్రచారమవుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో రకుల్ ప్రీత్ సింగ్… హీరో సిద్ధార్ధ్ నటిస్తున్నారు.