చీరలో ఆరడుగుల బుల్లెట్టు

0

మాస్ మహారాజా రవితేజ నటించిన `అమర్ అక్బర్ ఆంటోని` ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ జేఆర్ సీలో అభిమానుల మధ్య కోలాహాలంగా జరిగింది. ఈ వేడుక ఆద్యంతం రాజా ఫ్యాన్స్ ఉల్లాసంగా కనిపించినా.. ఎందుకనో వేదికపై అస్సలు గ్లామర్ అన్నదే లేకపోవడం కొంతవరకూ నిరాశపరిచింది. ఇటీవల ఏ ప్రీరిలీజ్/ఆడియో ఈవెంట్ పరిశీలించినా గ్లామర్ కంటెంట్ – ఆకర్షణ కోసం ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. `అమర్ అక్బర్ ఆంటోని` వేదికకు అది కాస్తా మిస్సయ్యింది. ఇలాంటి టైమ్ లో ఒకే ఒక్క దేవత మాత్రం ఆదుకుంది. ఆ దేవత ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. యూత్ హార్ట్ బీట్ ది గ్రేట్ ఇలియానా.

నేటి ఈవెంట్ లో షో స్టాపర్ గా గోవా బ్యూటీ మైమరిపించింది. ఆరడుగుల బుల్లెట్టు రవితేజ పక్కనే ఈ భామ కజురహో శిల్పాన్ని తలపించిందంటే అతిశయోక్తి కాదు. బికినీ బీచ్ లో వయ్యారాల వడ్డనలు చేసినా ఇలియానానే చేయాలి. సాంప్రదాయక చీరకట్టులో దేవతలా కనిపించినా ఇలియానాకే చెల్లింది! అంటూ పొగిడేశారంతా. అన్నట్టు వేదిక ఆద్యంతం ఇలియానా చిరునవ్వులు చిందిస్తూ టీమ్ లో ఎంతో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసింది.

ఇలియానా మై డార్లింగ్ అంటూ రవితేజ తనకి గ్రాండ్ వెల్ కం చెప్పాడు. ఈ ఒక్క సినిమాతోనే కాదు.. ఇంకా వరుసగా సినిమాలు చేయాలని మైత్రి అధినేతలు సైతం ఇలియానాని బ్లెస్ చేయడం విశేషం. మొత్తానికి రీఎంట్రీని ఇల్లూ ఘనంగానే చాటుకుంటోంది. బహుశా తనని బ్లెస్ చేసిన మైత్రి అధినేతలు – రవితేజనే తిరిగి మరోసారి ఇలియానాకి ఛాన్సివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే హుషారులో ఇతర అగ్రహీరోలు సైతం ఈ భామకు పిలిచి అవకాశాలిస్తారేమో!!
Please Read Disclaimer