Templates by BIGtheme NET
Home >> Cinema News >> పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్న సప్తగిరి బ్యూటీ..!

పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్న సప్తగిరి బ్యూటీ..!


‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది యంగ్ బ్యూటీ కాశీష్ వోరా. కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన ఈ సినిమాలో కాశీష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రమంలో రెండేళ్ల గ్యాప్ తర్వాత చేతన్ హీరోగా నటించిన ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ అనే మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో వోరా అందాలు కుర్రకారుని బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అమ్మడు అవకాశాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

అప్పటి నుంచి సరైన ఆఫర్స్ కోసం ట్రై చేస్తూ వచ్చిన ఈ బ్యూటీకి లాక్ డౌన్ పుణ్యమా అని వరుస అవకాశాలు వస్తున్నాయి. అది కూడా పెద్ద నిర్మాణ సంస్థలు నిర్మించే చిత్రాల్లో అని తెలుస్తోంది. రెండు చిన్న చిత్రాల్లో నటించిన కాశీష్ వోరా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలైన యూవీ క్రియేషన్స్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ తీయబోయే సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. పెద్ద బ్యానర్లలో వరుస సినిమాలు చేయడం ప్రారంభించడంతో ఇప్పుడు చిన్న సినిమాల బ్యూటీ కాశీష్ కు పెద్ద పెద్ద అవకాశాలు వరిస్తున్నాయని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.