రాత్రిపూట ఓ గంటా అలా.. పెళ్లాం చెబితే వినాలి: పూరి హాట్ కామెంట్స్

0

కరోనా లాక్ డౌన్ తో సినిమా వాళ్లకు కావాల్సినంత పని దొరికింది. దీంతో వారి వ్యాపకాలను తెరమీదకు తెస్తున్నారు. ఈ క్రమంలోనే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుసపెట్టి తన మనోభావాలను పోడ్ కాస్ట్ ల పేరుతో విడుదల చేస్తున్నారు. సమాజంలోని ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ తనదైన శైలిలో వివరణ ఇస్తున్నారు.

జీవిత పాఠాలు నగ్న సత్యాలు నిర్మోహమాటంగా పూరి జగన్నాథ్ తన పోడ్ కాస్ట్ ఆడియోల్లో చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆలుమగల బంధంపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఆడవాళ్లు మగాళ్లు ఒక జాతి కాదనే సందేశమిచ్చారు.

‘ఆడవాళ్లు మగాళ్లు ఒక జాతి కాదని.. రెండు వేర్వేరు గ్రహాలకు చెందిన వారు. వాళ్లకి మనం మనకి వాళ్లు ఏలియన్స్. మనం ఏలియన్స్ తోనే లవ్ లో పడ్డాం. వాటినే పెళ్లి చేసుకున్నాం. మగ ఏలియన్స్ ఆడ ఏలియన్స్ కు భావాలు రాత్రి పూట ఏదో ఒక గంటసేపు కలుస్తాయే తప్ప.. తెల్లవారితే పూర్తి విరుద్ధంగా మారుతాయి’ అని పూరి జగన్నాథ్ మానవ సంబంధాలపై కుండబద్దలు కొట్టారు.

సమస్యలొస్తే మగాళ్లు పంచుకోరని.. ఆడవాళ్లు అందరితో పంచుకొని చాలా ప్రాక్టికల్ గా ఉంటారని పూరి జగన్నాథ్ అన్నారు. ఈ మగ వెధవలకు ఆన్సర్ చెప్పలేక పెళ్లాల మీద చేయిచేసుకుంటారని పూరి వాపోయారు. అలా చేయకుండా భార్యను గౌరవించండని సూచించారు.

మనం తాళి కట్టింది ఏలియన్ కి.. వాళ్ల బాష వేరు.. మన భాష వేరు.. యే రోజంతా అందరి దగ్గర అన్నీ భరించి వస్తావని.. నీకెందుకు పౌరుషం అని.. భార్య చెప్పింది విను అని పూరి జగన్నాథ్ అన్నారు. నేనంతే అంటే ఏలియన్స్ తాటతీస్తాయ. ఆడ మగ మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి’ అని పూరి అన్నారు.