Templates by BIGtheme NET
Home >> Cinema News >> మరో అరుదైన గౌరవంను దక్కించుకున్న రహమాన్

మరో అరుదైన గౌరవంను దక్కించుకున్న రహమాన్


ఆస్కార్ అవార్డు గ్రహీత… ఇండియాస్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా పేరున్న ఏఆర్ రహమాన్ కు మరో అరుదైన గౌరవం దక్కడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్(బాఫ్టా) వారు రహమాన్ కు అరుదైన హోదాను కట్టబెట్టారు. వారు బ్రేక్ థ్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్ గా రహమాన్ ను నియమించడం జరిగింది. బ్రిటీష్ అధికారిక సంస్థ అయిన బాఫ్టా వారి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ట్యాలెంట్ ను గుర్తించే బాధ్యత ఈయనకు అప్పగించడం జరిగింది.

నెట్ ఫ్లిక్స్ తో కలిసి జ్యూరీ మెంబర్స్ సినిమా.. క్రీడా.. టెలివిజన్ రంగాల్లో ప్రతిభ కనబర్చే ఔత్సాహికులను గుర్తించనున్నారు. బ్రిటీష్ ప్రభుత్వం నుండి వారికి పురష్కారాలు కూడా అందనున్నాయి. ఆ జ్యూరీలో ప్రముఖులు హేమా హేమీలు ఉన్నారు. అలాంటి జ్యూరీలో రహమాన్ కు ఛాన్స్ దక్కింది. ఈసందర్బంగా రహమాన్ ఆనందం వ్యక్తం చేశాడు. తనకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటాను. ఇండియాలో ఉన్న ట్యాలెంట్ ను గుర్తించి అంతర్జాతీయ వేదికపై నిలుపుతానుంటూ ధీమా వ్యక్తం చేశాడు. ఈ సందర్బంగా ఆయన ప్రతి ఒక్క భారతీయుడు గర్వించేలా తాను బాఫ్టాకు సేవలందిస్తానంటూ పేర్కొన్నాడు.