Templates by BIGtheme NET
Home >> Cinema News >> వర్మ ఇప్పట్లో ఆమెను వదలడా?

వర్మ ఇప్పట్లో ఆమెను వదలడా?


రామ్ గోపాల్ వర్మ ఈమద్య కాలంలో హీరోయిన్ గురించి ప్రశంసల వర్షం కురిపించింది అంటే కేవలం అప్సర రాణిపై మాత్రమే. థ్రిల్లర్ చిత్రం కోసం హీరోయిన్ ను వెదుకుతున్న సమయంలో ఆయనకు అప్సర తారస పడినట్లుగా తెలుస్తోంది. అప్పటి నుండి అప్సర గురించి నెట్టింట తెగ ప్రచారం చేస్తున్నాడు. ఆమె అందంకు తాను ఫిదా అయ్యానంటూ ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ చేశాడు. ఆమె అందమైన మొహంతో పాటు ఫిజిక్ విషయంలో నేను కన్ను తిప్పుకోలేక పోతున్నాను అంటూ నోటికి ఇష్టం వచ్చినట్లుగా వర్మ మాట్లాడాడు.

థ్రిల్లర్ చిత్రం తర్వాత ఆమెను వర్మ వదిలేస్తాడేమో అనుకున్నారు. తన సినిమా ప్రమోషన్ కోసం ఆమెను ఆకాశానికి ఎత్తి ఉంటాడని చాలా మంది భావించారు. కాని ఆమెకు వరుసగా తన సినిమాల్లో ఆఫర్లు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే డేంజరస్ చిత్రంలో కూడా ఆమెనే నటింపజేస్తున్నట్లుగా వర్మ ప్రకటించాడు. ఇండియాస్ ఫస్ట్ లెస్బియన్ మూవీ అంటూ వర్మ ప్రకటించాడు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ చిత్రంతో అప్సర మరోసారి రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఒకటి రెండు మెయిన్ స్ట్రీమ్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈమెకు అవి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఎప్పుడైతే వర్మ దృష్టిలో పడినదో అప్పటి నుండి రచ్చ రచ్చ చేస్తూనే ఉంది. వరుసగా ఈమె వర్మ సినిమాల్లో కనిపిస్తున్న కారణంగా త్వరలో పెద్ద సినిమాల్లో బయట సినిమాల్లో కూడా నటించే అవకాశం వస్తుందేమో అంటున్నారు. బోల్డ్ కంటెంట్ ను నమ్ముకుని సినిమాలు చేస్తున్న ఇతర హీరోయిన్స్ మాత్రం ఈమెను చూసి కుళ్లు కుంటున్నారని వారికి ఈమె సక్సెస్ మింగుడు పడటం లేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.