స్టార్ హీరోయిన్ స్కూబా డైవింగ్ లో 100కి 100 స్కోర్ చేసిందట

0

మాల్దీవులు దేవతలు తిరిగే స్వర్గధామాన్ని తలపిస్తోంది. అందాల కథానాయికల బికినీ బీచ్ విహారం అంతకంతకు అగ్గి రాజేస్తోంది. లేటెస్టుగా సోనాక్షి సిన్హా మాల్దీవుల విహారం ముగిసింది. వెకేషన్ నుంచి ఈ విహారం నుంచి సోనాక్షి స్కూబా డైవింగ్ సూట్ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్కూబా డైవింగ్ శిక్షకుడి వద్ద తర్ఫీదు పొందుతున్న ఫోటోని సోనాక్షి షేర్ చేసింది. స్కూబా స్పెషలిస్టుతో ఫన్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. స్కూబా డైవింగ్ లో ఇంతకుమించి బెస్ట్ ట్రైనర్ వేరొకరు ఉండరు. మహమ్మద్ బెస్ట్. ఇది నా కల. ఈసారి వందకు వంద మార్కులు స్కోర్ చేశాను! అంటూ ఉబ్బితబ్బిబ్బవుతోంది.

ఇంతకుముందు తన రిసార్ట్ వద్ద బ్లూ వాటర్స్ లో పూల్ అంచున కూర్చున్న ఫోటోని షేర్ చేయగా అది యువతరంలో వైరల్ అయ్యింది. “నేను మాల్దీవులను విడిచిపెట్టిన ప్రతిసారీ నా హృదయంలో కొంత భాగం తిరిగి మెమరీగా రివైండ్ అవుతోంది. మేము మళ్ళీ కలిసే వరకు … గ్రాండ్ పార్క్ కొధిప్పరు నుంచి ఈ ఫోటో ట్రీట్“ అంటూ వ్యాఖ్యను జోడించింది.

అరేబియా సముద్రంలో విస్తారమైన వాటర్ క్లబ్ లో స్కూబా డైవింగ్ సహా వాటర్ స్పోర్ట్స్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసింది రకుల్. బ్లూ వాటర్స్ .. వైట్ సాండ్ లో స్పష్టంగా కనబడుతున్నందున చుట్టూ ఉన్న జలాలు ప్లెజెంట్ గా కనిపిస్తున్నాయి. సముద్రం ముదురు నీలం రంగు ఘాడతను ఆవిష్కరిస్తోంది. అంత గొప్ప బ్యూటీ నడుమ సోనాక్షి ఫోటోషూట్ ఎంతో ఆహ్లాదకరంగా కుదిరింది.

ఇంతకుముందు రిసార్ట్ బృందం వీడియో క్లిప్ ల సమూహాన్ని కూడా సోనాక్షి పంచుకున్నారు. ఆ రిసార్ట్ కి వీడ్కోలు పలికినప్పటి దృశ్యాలు అవి. వీడియో క్లిప్ లో ఒకదాన్ని పంచుకుంటూ ఆమె ఇలా రాసింది: “నా కష్టతరమైన వీడ్కోలు !!!! చాలా ధన్యవాదాలు ..1985 ఫోర్ట్ జ్ఞాపకాలు ” అంటూ ఆవేదన చెందింది.

మాల్దీవుల్లో ఇటీవల చాలామంది తారలు సెలబ్రేషన్ చేశారు. భారతీయ చలనచిత్ర సోదరభావం నుండి చాలా మంది తారలకు ఇష్టమైన దీవి ఇది. సమంతా అక్కినేని- రకుల్ ప్రీత్ సింగ్- కాజల్ అగర్వాల్- తారా సుతారియా- తాప్సీ పన్నూ- నేహా ధూపియా .. ఇలా భామలంతా ఈ ద్వీపానికి హీట్ పెంచిన భామల జాబితాలో నిలిచారు.