టోన్డ్ బికినీ బాడీతో గుబులు రేపుతున్న స్టార్ డాటర్

0

టైగర్ ష్రాఫ్ సోదరి.. జాకీ ష్రాఫ్ డాటర్ కృష్ణ ష్రాఫ్ పరిచయం అవసరం లేదు. ఈ భామ ఇటీవలే సుదీర్ఘమైన టూర్ ముగించి తిరిగి ముంబై నగరానికి వచ్చారు. తన సోదరుడితో కలిసి దిగిన రేర్ ఫోటోని పంచుకున్న తరువాత.. లేటెస్ట్ సెల్ఫీ ఫోటోలతో ఒక్కసారిగా హీట్ పెంచేసింది. సమ్మర్ రాకముందే ఉష్ణోగ్రతల్లో మార్పు తెచ్చిందంటే కృష్ణా ఏ రేంజులో చెలరేగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా తన ఇన్ స్టాలో కృష్ణ ఒక అద్భుతమైన మోనోక్రోమ్ పోస్ట్ ను షేర్ చేసింది. బికినీలో తన టోన్డ్ బాడీని ఎలివేట్ చేస్తున్న ఫోటో ఇది. అభిమానులు ఈ ఫోటోని జోరుగా వైరల్ చేస్తున్నారు. టోన్డ్ లుక్ తో కంబ్యాక్ ఇలా! అంటూ కవ్వించే శీర్షికను ఈ ఫోటోకి జోడించింది.

ప్రియుడు ఎబాన్ హైమాస్ నుండి విడిపోయినట్లు ప్రకటించిన కృష్ణ ఇటీవల సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది. మీ అభిమానుల క్లబ్ లన్నీ అందమైనవి. కానీ దయచేసి నన్ను ఎబాన్ తో ట్యాగ్ చేయడాన్ని ఆపివేయండి. మేము ఇక కలిసి లేము. కాబట్టి మమ్మల్ని కలిపి ఉంచే ప్రయత్నం మానేయండి. ఇది చాలా పబ్లిక్ గా ఉన్నందున మీకు తెలియజేస్తున్నా.. ధన్యవాదాలు“ అంటూ కృష్ణ ఆ పోస్టులో చెప్పారు. అంతే కాదు కృష్ణ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి తన మాజీ బ్యూయోతో ఉన్న అన్ని ఫోటోలు వీడియోలను తొలగించింది.

కృష్ణ ష్రాఫ్ మాజీ ప్రియుడు ఎబాన్ హైమ్స్ విడిపోయిన తర్వాత ‘నిజమైన స్నేహం ప్రేమ’ గురించి ఒక నిగూడమైన నోట్ ని రాయడం ఆసక్తికర చర్చకు తావిచ్చింది.