Templates by BIGtheme NET
Home >> Cinema News >> వైన్ గ్లాస్ తో ఆపిల్ సిఈవో డాటర్ జలకాలాట

వైన్ గ్లాస్ తో ఆపిల్ సిఈవో డాటర్ జలకాలాట


దివంగత వాల్ట్ డిస్నీ బోర్డ్ సభ్యుడు.. ఆపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ మోడలింగ్ లో అడుగుపెట్టింది. 22 ఏళ్ల ఈవ్ జాబ్స్ బ్యూటీ బ్రాండ్ గ్లోసియర్ తో మోడలింగ్ పరిశ్రమలోకి ప్రవేశించింది. ప్రఖ్యాత గ్లోసియర్ క్రొత్త ప్రకటన కోసం ఈవ్ జాబ్స్ బాత్ టబ్ లో బబుల్ స్నానం చేయడమే గాక.. వైన్ గ్లాస్ తో దర్శనమిచ్చి అభిమానుల్లో చర్చకు తెర తీసింది. గ్లోసియర్ ప్రచారంలో నటి సిడ్నీ స్వీనీ .. నవోమి స్మాల్స్ తో కలిసి ఈవ్ జాబ్స్ నటించారు.

వెయ్యేళ్లుగా అభిమానుల ప్రియాతిప్రియమైన మేకప్ లైన్ అంటూ ఈవ్ ఇదిగో ఇలా పెదాలకు లిప్ స్టిక్ పూసుకుంటోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటో అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఈవ్ జాబ్స్ హాటస్ట్ లుక్ కుర్రాళ్లలో హాట్ టాపిక్ గా మారింది.

ఈవ్ జాబ్స్ 2021 లో స్టాన్ ఫోర్డ్ స్కూల్ విద్యార్ధిగా ఉంది. ఆమె శిక్షణ పొందిన ఈక్వెస్ట్రియన్ .. గుర్రపు క్రీడలో 25 ఏళ్లలోపు ప్రపంచంలోని అగ్రశ్రేణి రైడర్లలో ఒకరిగా ఉన్నారు.