విష్ణు `డి & డి`.. ఎవరా ఢీకొట్టే నాయికలు?

0

విష్ణు మంచు – శ్రీను వైట్ల `డబుల్ డోస్` ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగత తెలిసిందే. ఇదే ట్యాగ్ లైన్ తో తమ డి & డి చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రం గురించి మరింత తెలుసుకోవాలనుకునే ప్రేక్షకులలో ఉత్సుకత పెరిగింది.

తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఇద్దరు టాప్ హీరోయిన్స్ నటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వారితో మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. ప్రధాన కథానాయిక పాత్ర కోసం అను ఇమాన్యుయేల్ లేదా ప్రగ్యా జైస్వాల్ ను లాక్ చేస్తారట. ఆ మేరకు శ్రీను వైట్ల ప్రణాళికలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

జాబితాలో ఇంకా ఎక్కువ పేర్లను కలిగి ఉన్నా ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఆఫర్ అయితే ఉంటుందిట. విష్ణువైట్ల బలంగా అనుకున్నారని.. విష్ణును ఒప్పించేశారని కూడా చెబుతున్నారు. ఢీ సీక్వెల్ లో కథానాయికగా నటించే లక్కీ ఛాన్స్ ఎవరిని వరించనుందో చూడాలి. ఢీలో జెనీలియా కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.