బంగారాన్ని ప్రసాదంలా ఇస్తున్న హిందూ గుడి! లక్షల్లో భక్తులు!

0Akshardham-Temple-దేవుని ప్రసాదం అంటే సాధారణంగా పులిహోర, లడ్డు, కేసరి, చేనగలు గుర్తుకువస్తాయి. ఎవరినైనా మీ ఫేవరెట్ ప్రసాదం ఏంటి అని అడిగితే లిస్టులో ఫస్ట్ ఉండేది తిరుపతి లడ్డు. ఆ రుచి అలాంటిది మరి. హిందువులు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేటప్పుడు తమతో వీలైనంత డబ్బుని హుండీలో వేస్తుంటారు. కొందరు వెండి, బంగారం కూడా ఇస్తుంటారు. అలాగే గుడికి వచ్చిన భక్తులకి కూడా దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంలా ఇస్తుంటారు. సాధారణంగా అన్నిచోట్ల తిను పదార్థాలు ఇస్తారు. కాని మన దేశంలో ఒక్క గుడిలో మాత్రం బంగారం లేదా వెండిని ప్రసాదంలా ఇస్తారు.

మధ్యప్రదేశ్ లోని రత్లాం అనే ప్రాంతంలో ఓ మహాలక్ష్మి గుడి ఉంది. ప్రతీ ఏడాది ఈ గుడికి కోట్లల్లో విరాళాలు వస్తుంటాయి. వీటిలో బంగారం మరియు వెండి ఆభరణాలు ఉండడం విశేషం. ఇలా వచ్చిన వెండిని, బంగారాన్ని ప్రతీ ఏడాది దీపావళి సమయంలో ప్రసాదంలా తిరిగి భక్తులకు ఇచ్చేస్తారు. ఈ ప్రసాదాన్ని పొందేందుకు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి లక్షల సంఖ్యలో భక్తులు ఈ గుడిని సందర్శించుకుంటారు. చాలా సార్లు వీరు పొందే ప్రసాదం విలువ కన్నా వీరి రాకపోకలకు అయ్యే ఖర్చే ఎక్కువవుతుంది. కాని ఆ ప్రసాదాన్ని దేవుని ఆశిర్వాధంలా భావించి భద్రపరుచుకుంటారు.

మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి ఈ గిడికు వెళ్లి బంగారాన్ని ప్రసాదాన్ని తెచ్చేసుకోండి.