అక్కడ సెక్స్ చేసే వారి సంఖ్య పెరుగుతుందట!

0romance-in-airlinesసెక్స్ గురించి అవగాహన పెరిగే కొద్దీ జనం శృంగారాన్ని ఆస్వాదించే ప్రదేశాల జాబితా కూడా పెరిగిపోతోంది. ఒకప్పుడు ఏకాంతంగా గడపటం అనేది పడక గదికే పరిమితం కాగా.. తర్వాత ఇతర చోట్లలోనూ ఎంజాయ్ చేయడం పెరిగింది. బహిరంగ ప్రదేశాల్లోనూ సెక్స్ చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బీచ్‌ల్లోనే కాకుండా పబ్లిక్ వాష్‌ రూంలు, విమానాల్లోనూ రతి క్రీడను ఆస్వాదిస్తున్నారు. ఇవే కాదు ఆస్వాదనకు ఏ చోటు అనర్హం కాదన్నట్లు.. విమానాశ్రయాల్లోనూ పని కానిచ్చేస్తున్నారు.

అమెరికాలో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. విమానాల్లో ప్రయాణించే ప్రతి పది మందిలో ఒకరు ఎయిర్‌పోర్టుల్లో రాసలీలలు సాగిస్తున్నట్టు తేలింది. కాగా విమానాల్లో సెక్స్‌ను ఎంజాయ్ చేస్తున్న వారితో పోలిస్తే.. విమానాశ్రయాల్లో ఏకమవుతున్న జంటల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంది.

ఎయిర్‌పోర్టుల్లో విమానం కోసం ఎదురు చూసే క్రమంలో ఎక్కువ టైం దొరుకుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని, ఫ్లయిట్ బయల్దేరడానికి మూడు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకుంటుండంతో ఇలా చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. చాలా మంది తమ పార్టనర్‌తో ట్రిప్ సందర్భంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐదు శాతం మంది మాత్రం తమకు ఇంతకు ముందు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తితో ఇలా శృంగారాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు. రసాస్వాదన వేళ ఎయిర్‌పోర్టు సిబ్బంది కంటబడినట్లు 17 శాతం మంది అంగీకరించారు.