Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> పర్స్ లో తప్పకుండా ఉంచుకోవలసిన ఐదు రకాల మేకప్ లు

పర్స్ లో తప్పకుండా ఉంచుకోవలసిన ఐదు రకాల మేకప్ లు


ఒక్కొక్కరికి వారి అవసరాన్ని మరియు సందర్భాన్ని బట్టి వివిధ రకాల మేకప్’లు అవసరమవుతాయి. ఒక అమ్మాయి తన యుక్త వయసులో పర్స్’లో వాడే మేకప్ కిట్స్, తను ఆఫీసు వెల్లే సమయంలో వాడే మేకప్ కిట్స్ వేరుగా ఉంటాయి. మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండా, కొన్ని రకాల బేసిక్ మేకప్స్ మీతో ఉంచుకొండి.

ఇక్కడ తెలిపిన ప్రతి మేకప్ వస్తువు ఇంట్లో ఉండే మరియు వీటినిమీ అలంకరణ బ్యాగ్’లో ఉంచుకోవచ్చు. ఇవి మీ బ్యాగ్’లో ఉంచుకోవటం వలన, మీ సౌందర్యాన్ని అవసరం అయిన విధంగా, వేగంగా పెంపొందిస్థాయి.

కన్సీల

ఇది ఒక గొప్ప మరియు వివిధ రకాలుగా అందానికి ఉపయోగించే కారకం. ఇది చర్మం పైన ఉండే కలంకాలను దాచి పెట్టి, ముఖానికి కాంతిని చేకూరుస్తుంది. కన్సీల ద్రావణాలు, క్రీమ్స్ మరియు స్టిక్స్ రూపాలలో లభిస్తాయి. ద్రావణాల రూపంలో ఉండే కన్సీల ముఖానికి ఎక్కువ కాంతిని, స్టిక్స్ ఘణ రూపంలో ఉండి అపారదర్శకంగా పనిచేస్తాయి. డార్క్ సర్కిల్స్ మాస్కింగ్ లేదా కళ్ళ కింద వచ్చే పఫ్నెస్ వంటి సమస్యలను దాచి ముఖానికి కాంతి చేకూర్చటానికి కన్సీలని ఉపయోగిస్తారు. చేతి వేల్లతో కన్సీలని ముఖానికి పూసిన తరువాత, మిశ్రమాన్ని స్పాంజ్’తో సమానంగా అద్దాలి.

మస్కరా
పొడవు, మందమైన కనురెప్పలని కలిగి ఉండి అబ్బాయిలను ఆకర్షించాలని అమ్మాయిలు కోరుకుంటారు. మస్కరని వాడే విధానాన్ని బట్టి కను రెప్పలను పొడవుగా, మందంగా మరియు ఒక్కొక్క కనురెప్పని వేరు చేస్తుంది. సన్నగా ఉండే మస్కరని సన్నని బ్రెష్’తో పూయటం వలన కను రెప్పలు సహజంగా కనపడతాయి మరియు మందంగా ఉండే మస్కరని మందమైన బ్రెష్’తో పూయటం వలన కను రెప్పలు చూడటానికి విస్తృతంగా కనిపిస్తాయి.

మస్కరని పర్స్’లో ఉంచుకోవటం వలన చాలా రకాలుగా మరియు మీకు అవసరం అయినన్ని సార్లు కను రెప్పలకి కోటింగ్ చేసుకోటానికి ఉపయోగపడుతుంది. మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటపుడు ఒక మస్కరని ఉదయం వాడటం వలన, మధ్యాన్నం మీటింగ్’లో మరియు మూడవసారి సాయంత్రం పార్టీలో కనురెప్పలు మందంగా కనిపించేలా చేసుకోవచ్చు.

లిప్స్టిక్/ లిప్ గ్లోస్
పెదాలు ముఖానికి అందాన్ని, ఆకర్షణని చేకూరుస్తాయి. లిప్స్టిక్ పెదాలకు పారదర్శకంగానూ, గ్లోస్ పెదాలను కాంతివంతంగా చేస్తాయి. గ్లోస్ పెదాలను లావుగా కనపడేలా చేసి వాటికి మెరుపుని చేకూర్చి ఆకర్శనీయంగా కనిపించేలా చేస్తాయి. పెదాలు మందంగా, ఆకర్శనీయంగా, పొడి బారకుండా ఉండటానికి సరైన వాటిని ఎంచుకోని, మీతో తీసుకు వెళ్ళండి. బ్రౌనిష్ పింక్, సాఫ్ట్ పింక్, లైట్ రెడ్ మరియు లేత గోదుమ రంగు లిప్స్టిక్ వాడటం వలన మీ పెదాలు కాంతి వంతంగా, ముదురు ఎరుపు, బ్రౌన్ కలర్’లో మారి పెదాలు ఆకర్శనీయంగా కనపడతాయి.

చేతిఅద్దం
ఒక చిన్న కాంబొ కాంపాక్ట్ మిర్రర్ మీతో ఉంచుకోవటం వలన ప్రతి సారి మీ వాష్ రూంని సందర్శించే సమయాన్ని ఆధాచేసుకొండి. మీ దంతాలను, మీ జుట్టు అమరికను ప్రయణంలో లేదా కూర్చున్నపుడు చెక్ చేసుకోవచ్చు. ఇలా మీతో కాంబొ కాంపాక్ట్ మిర్రర్ ఉంచుకోవటం వలన మరుగుదొడ్లులలో తయరయ్యేపుడు కలిగే ఇబ్బందులకు దూరంగా ఉండవచ్చు.

తేమని అందించేవి
తేమని అందించే వాటిని వాడటం వలన, పొడి చర్మానికి తిరిగి తేమని అందిస్తాయి. కొంత మంది సహజంగా పొడి చర్మాన్ని కలిగి ఉంటారు, దీని వలన చర్మం దురదగా అనిపిస్తుంది, ఇలా దురదలు నాణ్యత లేని సబ్బులని వాడటం లేదా పొడి వాతావరణంలో జీవించే వారిలో కనపడతాయి. ముఖం పైన ఆయిల్’ని కలిగి ఉండే వారు తప్పకుండా తేమని సమకూర్చే వాటిని వాడాలి.

ఈ ఐదు రకాల మేకప్’లని మీతో ఉంచుకోవటం వలన మీరు ఏలాంటి అనవసర మేకప్’లను బ్యాగ్’లో మోయటం అవసరం లేదు. మీకు నచ్చిన మరియు మేకప్ బ్రాండ్’లని వాడి ఈ లోకాన్ని, చుట్టూ ఉన్నవారిని ఆకర్షింపచేయండి.

చివరిగా..

  • పెదాలకు మెరుపుని ఇచ్చే ట్యూబ్’ని ఎప్పటికి మీతో ఉంచుకొండి.
  • చాలా మంది ఇంట్లో మస్కరని పగటి సమయం కన్నా రాత్రి సమయం ఎక్కువ వాడతారు.
  • కాన్క్లీయర్ అనేది మరొక గొప్ప బహుళ జాతి ఉత్పత్తి.
  • చేతి అద్దము మీతో ఉండటం వలన ఏ సమయంలో అయిన మీ మేకప్’ని పరీక్షించుకో వచ్చు.