మజిలీ రివ్యూ

0

 

విడుదల తేదీ : ఏప్రిల్ 05, 2019

నటీనటులు : సమంత, నాగ చైతన్య, దివ్యంశ కౌశిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి త‌దిత‌రులు.

దర్శకత్వం : శివ నిర్వాణ

నిర్మాత :  సాహు గారపాటి , హరీష్ పెద్ది

సంగీతం : గోపి సుందర్, తమన్

‘ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాలు కలిసి చేసిన సమంత, నాగ చైతన్య మళ్లీ ఇన్నాళ్లకు కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన చిత్రం మజిలీ. పెళ్లి తర్వాత చైతు, సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో ఈ చిత్రం భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకోగలిగిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

పూర్ణ (నాగచైతన్య) ఎలాంటి బాధ్యతలు లేకుండా తాగుతూ.. ప్రేమించిన అమ్మాయినే తలచుకుంటూ కాలం గడుపుతూ తిరుగుతూ ఉంటాడు. అయితే ఇలాంటి వ్యక్తి జీవితంలోకి భర్తే ప్రాణం గా ప్రేమించే శ్రావణి (సమంత ) వస్తోంది. పూర్ణ ఎలా ఉన్నా ఏమి చేసినా గుడ్డిగా భర్తేకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వాళ్ళ జీవితంలోకి మీరా అనే పాప వస్తోంది.

ఆ తరువాత ఆ పాప కారణంగా వాళ్ళ జీవితాలు ఎలా మారాయి. డిప్రెషన్ లో ఉన్న పూర్ణ ఎలా మారాడు ? శ్రావణి అంటే ఎలాంటి ఫీలింగ్ లేని పూర్ణ ఆమెను భార్యగా ఎలా చూసాడు ? ఈ క్రమంలో వీరిద్దరి బంధం ఎలా కొనసాగింది? అసలు పూర్ణ అలా మారడానికి గల అమ్మాయి ఎవరు ? ఎందుకు వాళ్లు ఇద్దరూ విడి పోయారు ? పూర్ణ చివరకి మారాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాను వెండి తెర పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా నాగ చైతన్య, సమంత తమ పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే శివ నిర్వాణ రాసిన కథ మరియు పాత్రలు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాల్లోని సంఘటనలు పరిస్థితుల ఆధారంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కథను దర్శకుడు చాలా సున్నితంగా నడుపుతూ.. సినిమాలో ప్రేమతో పాటు ఆ ప్రేమలోని ఎమోషన్ని, పెయిన్ని కూడా హైలెట్ అయ్యే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను బాగా మలిచాడు.

ఇక సినిమాలో క్రికెటర్ గా అలాగే ఏ పని చెయ్యని భర్తగా నటించిన చైతు చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఇటు యంగ్ క్యారెక్టర్ లో తన శైలి నటనతో ఆకట్టుకోవడంతో పాటు.. అటు పెళ్లి అయిన తరువాత తాగుబోతు భర్తగా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. మెయిన్ గా సెకెండ్ హాఫ్ లో సమంతతో సాగే సన్నివేశాలు అలాగే క్లైమాక్స్ లో సమంతకి తన ప్రేమ గురించే చెప్పే సందర్భంలో కానీ చైతు నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అలాగే నాగ చైతన్యకి దివ్యంశ కౌశిక్ కి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది.

ఇక కథానాయకులుగా నటించిన సమంత, దివ్యంశ కౌశిక్ తమ పాత్రల్లో చాలా చక్కగా నటించారు. దివ్యంశ కౌశిక్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ ఆకట్టుకుంది. ఇక సమంత కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆ పెయిన్ అర్ధమయ్యేలా కేవలం తన కళ్లల్లో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి.

చైతుకు తండ్రి పాత్రలో నటించిన రావు రమేష్ తన నాచ్యురల్ నతనతో ఆకట్టుకోగా.. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో కనిపించిన పోసాని కూడా బాగా చేసారు. వీళ్లు తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో అక్కడక్కడ బాగానే నవ్వించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

భర్తే ప్రాణం అని నమ్మే ఒక మంచి భార్య పాత్రను అలాగే ప్రేమలో ఫెయిల్ అయిన ఒక భగ్న ప్రేమికుడికి జీవితంలోని సంఘటనలను బాగా రాసుకున్న దర్శకుడు శివ నిర్వాణ, స్క్రీన్ ప్లే ని మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకునే విధంగా రాసుకోలేదు. ముఖ్యంగా సినిమాలోని చాలా సన్నివేశాలను బాగా స్లోగా నడిపారు.

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మినహా మిగతా చాలా సీక్వెన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేసినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ సినిమాలో ఆయన చెప్పాలనుకున్న ప్రేమలో ఎమోషన్ తో పాటు పెయిన్ కూడా ఉంటుందనే కథాంశం బాగుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు శివ నిర్వాణ భార్య భర్తలకు సంబంధించి మంచి పాయింట్ తీసుకున్నారు. అయితే సినిమాలో కొన్ని సీక్వెన్స్ స్లోగా నడిపారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో క్రికెట్ దృశ్యాలతో పాటు ఓ కాలనీలో జరుగుతున్న కథకు అనుగుణంగా ఆయన విజువల్స్ ను చాలా అందంగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకుంటాయి. ఇక తమన్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా సమంత , చైతుల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

తీర్పు:

ముందుగానే చెప్పుకున్నట్లు సమంత, నాగ చైతన్య జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. దర్శకుడు శివ నిర్వాణ భార్య భర్తలకు సంబంధించి మంచి కథను తీసుకుని మంచి ఎమోషనల్ సన్నివేశాలతో బాగానే ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా భర్తే ప్రాణం అని నమ్మే ఒక మంచి భార్య పాత్రను అలాగే ప్రేమలో ఫెయిల్ అయిన ఒక భగ్న ప్రేమికుడి జీవితంలోని సంఘటనలను ఆయన బాగా రాసుకున్నాడు. అయితే స్క్రీన్ ప్లే ని మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. సినిమాలో కొన్ని సీక్వెన్స్ ను బాగా స్లోగా నడపడం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. ఇక చైతు, సమంత తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తం మీద ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా మెప్పిస్తోంది. అలాగే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని కూడా బాగానే అలరిస్తుంది.

 

‘‘మజిలీ.. మజిలీ.. మజిలి.. ఈ పేరు ఎంత హాయిగా ఉందో కదూ.. గత కొన్నాళ్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ‘మజిలీ’.. టైటిల్ చాలా డీసెంట్‌గా ఉందే. సమంత నాగచైతన్యలు పెళ్లి తరువాత నటిస్తున్నారా? ఇది ఇంకా సూపర్. చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నారే. అబ్బా.. టీజర్ ఏమన్నా ఉందా.. ‘వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారా’ ఏమైనా చెప్పాడా డైలాగ్. కసక్కున జనం మైండ్‌లోకి వెళ్లిపోతుందంతే. ఇక సాంగ్స్.. ఎన్నాళ్లైందో.. ఇలాంటి ప్యూర్ లవ్ ఎమోషనల్ సాంగ్స్ విని. అదిరిపోయాయి పాటలు. ఇంతకీ ట్రైలర్ చూశారా..? ‘సిగ్గుండాలిరా.. పెళ్లాం దగ్గర డబ్బులు తీసుకోవడానికి.. తినే తిండి.. కట్టుకునే బట్ట.. ఆఖరికి తాగే మందు కూడా భార్య సంపాదన మీదే’ అంటూ రావు రమేష్ డైలాగ్ చెప్తుంటే.. ఫట్ మని మరచెంబుతో మొహాన్ని పగలగొట్టినట్టు ఉంది పెళ్లాన్ని డబ్బులడిగే మొగుళ్లకు. సమంత నటించనట్టు లేదు.. జీవించేసిందంతే. ఏ సినిమా మిస్ అయినా ఇలాంటి ప్యూర్ లవ్ స్టోరీని అస్సలు మిస్ కాకూడదు’’.. ఇదీ సమంత, నాగ చైతన్య ‘మజిలీ’ చిత్రంపై ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్న భావన. మరి నిజంగానే సమంత-నాగ చైతన్యల జోడీ ప్రేమ మజిలీ అందించారా? ట్విట్టర్ రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రేక్షకులకు ఈ లవ్ అండ్ పెయిన్ భారంగా ఉందా? సెలబ్రేషన్‌లా ఉందో ట్వీట్స్ ద్వారా తెలుసుకుందాం.

సమంత నాగచైతన్య నటించిన ‘మజిలీ’ ప్రపంచ వ్యాప్తంగా నేడు (ఏప్రిల్ 5) భారీగా విడుదలైంది. ఇప్పటికే చిత్ర యూనిట్‌తో పాటు విదేశాల్లో ఉన్న ప్రేక్షకులు సైతం ప్రేమ ‘మజిలీ’ చూసి ఆస్వాదించేశారు. యూఎస్‌లో 150కి పైగా లొకేషన్లలో విడుదలైన ఈ చిత్రంపై ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. నిన్ననే ఈ చిత్రం సూపర్ హిట్ అంటూ ట్వీట్ చేసిన హీరో సుశాంత్.. ఫస్ట్ రివ్యూ అందించారు. సమంత, నాగ చైతన్యలు పాత్రల్లో జీవించారని.. భావోద్వేగ కథను చాలా సున్నితంగా మనసులకు హద్దుకునేలా శివ నిర్వాణ అద్భుతంగా తీశారంటూ ప్రశంసలు కురిపించారు. కాగా అక్కినేని నాగార్జునతో మరికొందరు ఈ చిత్రంపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

సమంత నాగ చైతన్యల నటన సూపర్బ్.. చాలా గర్వంగా ఉంది: నాగార్జున
‘మజిలీ’ చిత్రంలో సమంత నాగచైతన్యలు బ్రిలియంట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. వాళ్లను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రావు రమేష్ పోసాని క్రిష్ణ మురళి నటన అద్భుతం.

‘మజిలీ’ బ్యూటిఫుల్.. అదరగొట్టేశారు: సుశాంత్ 
‘మజిలీ’ చిత్రంలోని లవ్ అండ్ పెయిన్‌ని బాగా ఆస్వాదించా. శివ నిర్వాణ అద్భుతంగా తీశారు. సమంత, నాగ చైతన్యలు పాత్రల్లో జీవించారు. డెబ్యూతో దివ్యాంశ కౌశిక్ మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింది. రావురమేష్‌తో యూనిట్ మొత్తం అదరగొట్టారు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, గోపీ సుందర్ మ్యూజక్ సూపర్బ్. 

ఫస్టాఫ్ అదిరిపోయింది.. దివ్యాంశ సర్ ప్రైజ్ 
పూర్ణ, అన్షు పాత్రల్లో నాగచైతన్య, దివ్యాంశలు అదరగొట్టేశారు.. సెకండ్ హీరోయిన్ దివ్యాంశ సర్ ప్రైజ్ ఇచ్చింది. సాలిడ్ స్టోరీ. నాగ చైతన్యకు ఇదో బిగ్ బ్రేక్ మూవీ. 

‘మజిలీ’ : లైవ్ అప్డేట్స్:

 • మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.

 • చైతు మరియు సమంతల మధ్య ఇప్పుడొక భావోద్వేగ పూరిత సన్నివేశంతో క్లైమాక్స్ నడుస్తుంది.

 • ఇప్పుడు సినిమా క్లైమాక్స్ దిశకు చేరుకుంటుంది.చైతు ఇప్పుడిప్పుడే మాములు మనిషిగా మారుతున్నాడు.

 • చైతు మరియు సామ్ ల మధ్య వస్తున్న కుటుంబ నేపధ్య సన్నివేశాలు బాగున్నాయి.ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఏ మనిషికి ఏ మజిలీయో పాట వస్తుంది.

 • ఇప్పుడు మళ్ళీ సినిమా వైజాగ్ కు షిఫ్ట్ అయ్యింది.కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి.

 • ఇప్పుడు సినిమా డెహ్రాడూన్ కు మారింది.ఒక క్రికెట్ అకాడమీలో చైతు ఉద్యోగాన్ని వెతుక్కున్నాడు.ఇక్కడే చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది.

 • ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ పార్టీ చేసుకుంటున్నారు.ఇప్పుడు వన్ బాయ్ వన్ గర్ల్ పాట వస్తుంది.

 • స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల చైతు సమంతను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది.

 • ఇప్పుడు సమంత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలయ్యింది.తన వెర్షన్ నుంచి చై ను ప్రేమిస్తున్న సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి,దానికి తగ్గట్టుగా ప్రియతమా పాట వస్తుంది.

 • సమంత పోసాని కృష్ణ మురళి కూతురిగా కనిపిస్తుంది.కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి.

 • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి సినిమా బాగానే కొనసాగింది.ఇంటర్వెల్ లో ఎంట్రీ ఇచ్చిన సమంత పాత్ర తర్వాత కొనసాగబోయే మిగతా సినిమాకి కీలకంగా మారనుందని అర్ధమవుతుంది.మరి ఇక నుంచి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

 • సమంత ఇంట్రోతో సినిమా సగానికి పూర్తయ్యింది.ఇప్పుడు విరామం.

 • ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పూర్తయ్యింది.ఇప్పుడు చైతు మరియు సుబ్బరాజ్ మనుషుల మధ్య ఒక మాస్ ఫైట్ సీన్ వస్తుంది.

 • ఇప్పుడు సినిమా కాస్త సీరియస్ గా సాగుతుంది.పూర్ణ మరియు అన్షు లు వారి తల్లిదండ్రుల వల్ల వేరు చేయబడ్డారు.ఇప్పుడు ఏడెత్తు మల్లెలే పాట సెంటిమెంట్ వెర్షన్ లో వస్తుంది..

 • ఇప్పుడు చై మరియు సుబ్బరాజ్ ల మధ్య ఒక వీధిలో గొడవ జరుగుతుంది.ఈ గొడవలో దివ్యాన్సాను కాపాడటానికి చైతు ప్రయత్నిస్తున్నాడు.

 • చై తన జీవిత లక్ష్యం నుంచి మెల్లగా దారి తప్పుతున్నాడు.ఇప్పుడు మెల్లగా సుబ్బరాజు గ్యాంగ్ లోకి చేరుతున్నాడు.

 • ఇప్పుడు నా గుండెల్లో పాట వస్తుంది.ఈ పాటలో వైజాగ్ విజువల్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి.

 • పూర్ణ మరియు అన్షులా మధ్య ఇప్పుడిప్పుడే స్నేహం చిగురిస్తుంది.ఈ ఇద్దరి మధ్య వస్తున్న సన్నివేశాలు చాలా బాగున్నాయి.

 • నావీ ఆఫీసర్ అతుల్ కులకర్ణి కూతురు అన్షుగా దివ్యాన్ష ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది.

 • ఒక యువ రాజకీయ నాయకుడిగా సుబ్బరాజ్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు.అక్కడి లోకల్ క్రికెట్ టీమ్ సభ్యులుగా కొన్ని పాత్రలు ఇప్పుడు పరిచయం అయ్యాయి.

 • చై తన స్నేహితులతో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.ఇప్పుడు వారి మధ్య మాయ్య మాయ్య సాంగ్ వస్తుంది.

 • మ్యాచ్ పూర్తయ్యింది.బ్యాక్గ్రౌండ్ లో ఏడెత్తు మల్లెలే పాటతో టైటిల్స్ వస్తున్నాయి.ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి చేరుకుంది.పూర్ణ టీనేజ్ వయసులోకి సినిమా వెళ్ళింది.

 • చైతు ఇప్పుడే పూర్ణగా ఒక సింపుల్ మాస్ ఎంట్రీ ఇచ్చారు.ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.

 • సినిమా జబర్దస్త్ మహేష్ క్రికెట్ కామెంట్రీతో ఇప్పుడే మొదలయ్యింది

 • హాయ్ 154 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.

  విడుదల తేదీ : ఏప్రిల్ 05, 2019 నటీనటులు : సమంత, నాగ చైతన్య, దివ్యంశ కౌశిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి త‌దిత‌రులు. దర్శకత్వం : శివ నిర్వాణ నిర్మాత :  సాహు గారపాటి , హరీష్ పెద్ది సంగీతం : గోపి సుందర్, తమన్ ‘ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాలు కలిసి చేసిన సమంత, నాగ చైతన్య మళ్లీ ఇన్నాళ్లకు కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన చిత్రం మజిలీ. పెళ్లి తర్వాత చైతు, సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో ఈ చిత్రం భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకోగలిగిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ! కథ : పూర్ణ (నాగచైతన్య) ఎలాంటి బాధ్యతలు లేకుండా తాగుతూ.. ప్రేమించిన అమ్మాయినే తలచుకుంటూ కాలం గడుపుతూ తిరుగుతూ ఉంటాడు. అయితే ఇలాంటి వ్యక్తి జీవితంలోకి భర్తే ప్రాణం గా ప్రేమించే శ్రావణి (సమంత ) వస్తోంది. పూర్ణ ఎలా ఉన్నా ఏమి చేసినా గుడ్డిగా భర్తేకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వాళ్ళ జీవితంలోకి మీరా అనే పాప వస్తోంది. ఆ తరువాత ఆ పాప కారణంగా వాళ్ళ జీవితాలు ఎలా మారాయి. డిప్రెషన్ లో ఉన్న పూర్ణ ఎలా మారాడు ? శ్రావణి అంటే ఎలాంటి ఫీలింగ్ లేని పూర్ణ ఆమెను భార్యగా ఎలా చూసాడు ? ఈ క్రమంలో వీరిద్దరి బంధం ఎలా కొనసాగింది? అసలు పూర్ణ అలా మారడానికి గల అమ్మాయి ఎవరు ? ఎందుకు వాళ్లు ఇద్దరూ విడి పోయారు ? పూర్ణ చివరకి మారాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాను వెండి తెర పై చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ : ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా నాగ చైతన్య, సమంత తమ పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే శివ నిర్వాణ రాసిన కథ మరియు పాత్రలు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాల్లోని సంఘటనలు పరిస్థితుల ఆధారంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కథను దర్శకుడు చాలా సున్నితంగా నడుపుతూ.. సినిమాలో ప్రేమతో పాటు ఆ ప్రేమలోని ఎమోషన్ని, పెయిన్ని కూడా హైలెట్ అయ్యే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను బాగా మలిచాడు. ఇక సినిమాలో క్రికెటర్ గా అలాగే ఏ పని చెయ్యని భర్తగా నటించిన చైతు చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఇటు యంగ్ క్యారెక్టర్ లో తన శైలి నటనతో ఆకట్టుకోవడంతో పాటు.. అటు పెళ్లి అయిన తరువాత తాగుబోతు భర్తగా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. మెయిన్ గా సెకెండ్ హాఫ్ లో సమంతతో సాగే సన్నివేశాలు అలాగే క్లైమాక్స్ లో సమంతకి తన ప్రేమ గురించే చెప్పే సందర్భంలో కానీ చైతు నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అలాగే నాగ చైతన్యకి దివ్యంశ కౌశిక్ కి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. ఇక కథానాయకులుగా నటించిన సమంత, దివ్యంశ కౌశిక్ తమ పాత్రల్లో చాలా చక్కగా నటించారు. దివ్యంశ కౌశిక్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ ఆకట్టుకుంది. ఇక సమంత కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆ పెయిన్ అర్ధమయ్యేలా కేవలం తన కళ్లల్లో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి. చైతుకు తండ్రి పాత్రలో నటించిన రావు రమేష్ తన నాచ్యురల్ నతనతో ఆకట్టుకోగా.. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో కనిపించిన పోసాని కూడా బాగా చేసారు. వీళ్లు తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో అక్కడక్కడ బాగానే నవ్వించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. మైనస్ పాయింట్స్ : భర్తే ప్రాణం అని నమ్మే ఒక మంచి భార్య పాత్రను అలాగే ప్రేమలో ఫెయిల్ అయిన ఒక భగ్న ప్రేమికుడికి జీవితంలోని సంఘటనలను బాగా రాసుకున్న దర్శకుడు శివ నిర్వాణ, స్క్రీన్ ప్లే ని మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకునే విధంగా రాసుకోలేదు. ముఖ్యంగా సినిమాలోని చాలా సన్నివేశాలను బాగా స్లోగా నడిపారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మినహా మిగతా చాలా సీక్వెన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేసినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ సినిమాలో ఆయన చెప్పాలనుకున్న ప్రేమలో ఎమోషన్ తో పాటు పెయిన్ కూడా ఉంటుందనే కథాంశం బాగుంది. సాంకేతిక విభాగం : దర్శకుడు శివ నిర్వాణ భార్య భర్తలకు సంబంధించి మంచి…

మజిలీ రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 3.5
సాంకేతిక వర్గం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3.5

3.3

మజిలీ రివ్యూ

మజిలీ రివ్యూ

User Rating: Be the first one !
3Please Read Disclaimer