తాప్సీ ఆరెక్స్ బ్యూటీ అవుతుందట!

0పెట్టుబడి – రాబడి కోణంలో చూస్తే ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ‘RX 100’.. ఇందులో పెద్దగా అనుమానాలు ఏవీ పెట్టుకోనవసరం లేదు. యూత్ ను ఫుల్ గా ఇంప్రెస్ చేసిన ఈ సినిమా కంటెంట్ పై కొన్ని విమర్శలు వచ్చాయి గానీ అల్టిమేట్ గా ‘సక్సెస్ మ్యాటర్స్’ కాబట్టి అవేవీ పట్టించుకోవసరం లేదు. ఈ సినిమాను ఇతర భాషల్లో కి రీమేక్ చేసేందుకు ఆల్రెడీ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి.

ఈ సినిమాను తమిళంలో ఆది పినిశెట్టి హీరోగా రిమేక్ చేయడానికి రంగం సిద్దం అవుతోంది. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా తాప్సీ పన్ను నటిస్తుందట. తెలుగులో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ తనకు మొదటి సినిమా అయినప్పటికీ యాక్టింగ్ వైజ్ మంచి మార్కులు తెచ్చుకుంది. హీరో కార్తికేయకు ఘాటు ముద్దులిచ్చి ప్రేక్షకుల్లో హీట్ పెంచింది. మరి ఈ తమిళ రీమేక్ లో తాప్సీ ఆది కి అలాంటి ఘాటు కిస్సులిచ్చి మోసం చేయడానికి రెడీ అయినట్టే. ఈమధ్యే ఆది రిక్వెస్ట్ పై ‘RX 100’ సినిమా చూసి పిచ్చపిచ్చగా నచ్చడంతో వెంటనే హీరోయిన్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

ఆరా సినిమాస్ బ్యానర్ వారు ఈ సినిమాను తమిళంలో నిర్మిస్తారట. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారట. ఈ సినిమాకు డైరెక్టర్ – ఇతర నటులు – టెక్నిషియన్స్ ను ఫైనల్ చేయాల్సి ఉంది.