నా భర్త మితిమీరిన శృంగారంతో నన్ను వేధిస్తున్నాడు

0bobby-darling-with-husbandతన భర్త తనని హింసిస్తున్నాడు అని నటి బాబి డార్లింగ్ తన భర్త రామ్మీన్‌ శర్మ నుంచీ విడాకులు కోరుతూ కోర్టుని ఆశ్రయించింది.మద్యం సేవించి వచ్చి రామ్మీన్‌ తనని విపరీతంగా కొట్టేవాడని చెప్పింది.అంతేకాదు తన అసహజ శృంగారం చేస్తూ తనని చిత్ర హింసలు పెడుతున్నాడని ఆరోపించింది. నా ఆస్తులు అన్నింటినీ తన పేరుమీద .రాయించుకొని తనను వేధిస్తున్నాడని, తన వద్ద ఇప్పుడు ఏమాత్రం డబ్బు లేదని ఆమె మీడియాకు తెలిపింది. ముంబై లో తన పేరుమీద ఉన్న ఒక ప్లాట్ కి తానూ కూడా యజమానిలా వీలునామా రాయించుకున్నాడని. భోపాల్ లో ఒక హౌస్ కొన్నప్పుడు కూడా ఇదే విధంగా చేశాడని.పెళ్ళయ్యాక నా డబ్బుతో జల్సాలు చేశాడని ఇప్పుడు తన దగ్గర ఒక్క పైసా కూడా లేదని వాపోయారు బాబి డార్లింగ్. నేను ఏమి చేస్తున్నానో ,ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకోవడం కోసం రామ్నీక్‌ ప్రైవేటు సంస్థ ద్వారా సెక్యూరిటీ గార్డులను పెట్టుకున్నాడని. ప్రతీ రోజు అనుమానంతో తనని భాదిస్తున్నాడని తెలిపింది బాబి. అంతే కాకుండా ఇద్దరం పరస్పర ఒప్పందంతో విడాకులు తీసుకుందాం అని ఎంత చెప్పినా వినకుండా నిత్యం తనని వేదిస్తున్నాడని ఘోల్లు మంది బాబి.భర్త నుంచి తన ఆస్తి తనకు ఇప్పిస్తే.వాటన్నింటినీ అమ్మేసి తిరిగి ముంబైకి వచ్చి నివసిస్తానని ఆమె తెలిపింది.ఇలాంటి వ్యక్తులమీద కటిన చర్యలు తీసుకునేలా అందరు సహకరించాలని వేడుకుంది బాబి డార్లింగ్.